Health Tips: డ్రైవింగ్ చేసేటప్పుడు వెన్నునొప్పి వస్తుందా.. ఈ చిట్కాలతో మీ ప్రయాణం సాఫీగా..
ఎక్కువ దూరం ప్రయాణించాలంటే చాలా మంది సొంతంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లడానికి ఇష్టపడతారు. ఇది ఖచ్చితంగా అందరికి సౌకర్యవంతంగా అనిపిస్తుంది. కానీ ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం అనేది కొంచెం చికాకు కలిగించే పనే. శరీర నొప్పులు, ముఖ్యంగా వెన్నునొప్పి వేధిస్తుంటుంది. అందుకే డ్రైవింగ్ చేయడం ఎవరికైనా అలసటతో కూడుకున్న పని. చాలా సేపు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు వెన్నునొప్పి సమస్య ఉండవచ్చు.