ఆరోగ్యం కోసం రోజుకు కనీసం ఒక గుడ్డైనా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. గుడ్డులో పలు ప్రోటిన్లు, శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు అనేకం ఉంటాయి. అందుకే గుడ్డు శరీరానికి మల్టీ విటమిన్‌గా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. పైగా పెద్దలతో పాటు పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఈక్రమంలో చాలామంది మార్కెట్ల నుంచి ఒకేసారి డజన్ల కొద్దీ గుడ్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తారు .