- Telugu News Photo Gallery Spiritual photos Monday Vastu Tips: Do these measures of monday there will never be a shortage of money lord shiva puja on monday
Monday Vastu Tips: ఆరోగ్య, ఆర్థిక సమస్యలా సోమవారం ఈ ఐదు చిట్కాలను పాటించి చూడండి..
ప్రతి వ్యక్తి జీవితంలో కష్ట, సుఖాలు, ఆరోగ్య సమస్యలు, సుఖ సంతోషాలు తప్పనిసరిగా ఉంటాయి.. అయితే కొందరి జాతక ప్రభావంతో అందరికంటే కొంచెం ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటు ఉంటారు. జాతకంలో గ్రహాల ప్రభావంతో కొందరు కొన్ని శారీరక సమస్యలతో ఇబ్బంది పడితే.. మరొకొందరు అధికంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. అంతేకాదు జీవితంలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి చెడు కాలం కొనసాగడానికి కారణం అనేక కారణాలు అని చెప్పవచ్చు. వీటికి తొలగించడానికి సోమవారం నాడు కొన్ని నివారణ చర్యలు పేర్కొన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో..
Updated on: Aug 28, 2023 | 9:16 AM

ఒకవైపు అప్పుల భారం.. మరోవైపు ఆర్థిక నష్టంతో ఆర్థికపరమైన చిక్కులు తరచుగా తలెత్తుతూ.. ఒకదాని తర్వాత ఒక సమస్య కలుగుతూ ఇబ్బంది పెడుతుంటే.. వీటన్నింటి తోడు శారీరక సమస్యలు జత కలిస్తే.. ఆ వ్యక్తి పడే ఇబ్బందుల గురించి చెప్పనలవి కాదు. ముఖ్యంగా చాలా మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. వాటికోసం చేతిలో ఉన్న డబ్బులు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు జీవితంలో అడ్డంకులు ఏర్పడతారు. అనేక కారణాల వల్ల చెడు కాలం కొనసాగితే.. సోమవారం ఈ నివారణ చర్యలు చేసి చూడండి..

సోమవారం నాడు పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు, పంచదార దానం చేయండి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. సోమవారం ఈ వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దానంతో జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా చేపట్టిన పనిలో విజయం అందకుండా పోతుంటే. ఈ నివారణ చర్యలు ఉత్తమం.

సోమవారం శివయ్యకు అంకితం చేయబడిన రోజు. ఈ రోజున శివుని పూజిస్తారు. నెయ్యితో హల్వా తయారు చేసి శివునికి నైవేద్యంగా సమర్పించండి. మీకు శివుని అనుగ్రహం లభిస్తుంది. జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

శివయ్య ఆలయంలో ఒక జత వెండి పాములను దానం చేయండి లేదా 5 మంది స్త్రీలకు పాలు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన ప్రయోజనం పొందుతారు. జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. పురాణాల గ్రంధాల ప్రకారం జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా అధిగమించడానికి ఈ ఉపాయం చాలా ఉపయోగపడుతుంది.

ఆత్మవిశ్వాసం లేమితో బాధపడేవారు సోమవారం ప్రత్యేక ఉపాయం చేయవచ్చు. ప్రతి సోమవారం శివుని 'రక్షా స్తోత్రం' పఠించండి. అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగితే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కాబట్టి ఈ చిట్కాను పాటించండి.

జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు చంద్ర శేఖర్ స్తోత్రాన్ని పఠిస్తారు. చాలా మంది జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటాడు. వారు ప్రతి సోమవారం చంద్ర శేఖర్ స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వలన ప్రయోజనం పొందుతారు. అంతేకాదు అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది.





























