AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi Festival: భద్ర నీడలో పౌర్ణమి.. రాఖీ పండగ బుధవారం, గురువారం ఎప్పుడు జరుపుకోవాలి? సరైన రోజు, సమయం తెలుసుకోండి..

సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుని రాఖీతో  అలంకరించేందుకు తమకు ఇష్టమైన రాఖీలను ఎంచుకుంటూ బిజిబిజీ అయ్యారు. అయితే ఇప్పటి వరకు రక్షా బంధన్‌ను ఎప్పుడు జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. ఎందుకంటే రాఖీ పండగ బుధవారం అంటే ఆగస్టు 30న అని కొందరు చెబుతుండగా, ఆగస్టు 31న పండగ జరుపుకోవాలని చాలా మంది అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాఖీ కట్టడానికి ఏ రోజు మంచిది..

Rakhi Festival: భద్ర నీడలో పౌర్ణమి.. రాఖీ పండగ బుధవారం, గురువారం ఎప్పుడు జరుపుకోవాలి? సరైన రోజు, సమయం తెలుసుకోండి..
Surya Kala
|

Updated on: Aug 29, 2023 | 9:56 AM

Share

ఏడాది పొడవునా సోదర సోదరమణులు రాఖీ పండగ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా శ్రావణ మాసం  ప్రారంభంతో ప్రజలు రక్షా బంధన్ కోసం ఎదురుచూడడం ప్రారంభిస్తారు. పవిత్రమైన రాఖీ పండుగ శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమి తిధి రేపు.. ఎల్లుండి రెండు రోజులుంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లోనూ రాఖీ కొనుగోళ్ల సందడి మొదలైంది. సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుని రాఖీతో  అలంకరించేందుకు తమకు ఇష్టమైన రాఖీలను ఎంచుకుంటూ బిజిబిజీ అయ్యారు. అయితే ఇప్పటి వరకు రక్షా బంధన్‌ను ఎప్పుడు జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. ఎందుకంటే రాఖీ పండగ బుధవారం అంటే ఆగస్టు 30న అని కొందరు చెబుతుండగా, ఆగస్టు 31న పండగ జరుపుకోవాలని చాలా మంది అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాఖీ కట్టడానికి ఏ రోజు మంచిది.. ఎప్పుడు శుభ ముహూర్తం సరైనదో  గందరగోళాన్ని తొలగించుకోవడానికి పూర్తి సమాచారం మీ కోసం

ఈసారి  భద్ర నీడలో రాఖీ పండగ

భద్రుని నీడ కారణంగా సోదరునికి ఏ రోజు రాఖీ కట్టడం శుభప్రదమో ప్రజలు నిర్ణయించుకోలేకపోతున్నారు. ఆగష్టు 30వ తేదీ పౌర్ణమితో ఉదయం 9:01 నుండి రాత్రి 12:00 గంటల వరకు రాఖీ కట్టడం శుభప్రదమని కొందరు పండితులు చెప్పారు. ఆ రోజంతా భద్ర అని కాశీ పండితులు చెబుతుండగా.. అందుకే రాఖీ కట్టడానికి శ్రేయస్కరం రాత్రి 9 గంటల తర్వాత.. రాఖీ  పండుగను 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుపుకోవచ్చు. అదే సమయంలో రాఖీ కట్టేందుకు ఆగస్ట్ 31 శుభ ముహూర్తమని పలువురు పండితులు అంటున్నారు.

రాఖీ కట్టడంపై పండితుల అభిప్రాయం ఏమిటి?

ఆగస్ట్ 31న సోదరీమణులకు రాఖీ కట్టడానికి చాలా తక్కువ సమయం లభిస్తుందని చెప్పారు. వాస్తవానికి ఈ రోజు ఉదయం 7 గంటల వరకు మాత్రమే శుభ సమయం. అందుకే పొద్దున్నే రాఖీ కట్టడం కుదరదు. అందుకే ఆగస్టు 30వ తేదీ రాత్రి రాఖీ కట్టడం మంచిదని.. ఆగస్టు 31న రాఖీ కట్టే సమయంలో శుభ ముహూర్తం తప్పితే అశుభం కలుగుతుందని అంటున్నారు. అందుకే సోదరీమణులు అది రేపైనా, ఎల్లుండైన శుభ ముహూర్తాల్లో మాత్రమే సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)