AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri Temple: దుర్గమ్మ భక్తులకు శుభవార్త.. టీటీడీ తరహాలో ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు

దుర్గమ్మను దర్శించుకోవటానికి వచ్చే వికలాంగ, వృద్ధ భక్తులకు ఇబ్బందులు కలగకుండా బ్రోకర్లు చేస్తున్న మోసాన్ని అరికట్టడానికి ఇకపై ఘాట్ రోడ్ కింద పైన తీసుకుని వెళ్ళి తీసుకుని రావటానికి డీజిల్ వెహికల్స్ ఏర్పాటు చెయ్యనున్నారు. అలాగే ఈశాన్యం వైవు మూత పడ్డ మెట్ల మార్గాన్ని కూడా తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా దగ్గర పడుతున్న దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా కొండా దిగువన తాత్కాలిక విద్యుత్ అలంకరణ ఏర్పాటు చెయ్యటానికి 60,00,000 అంచనాతో సర్క్యులేషన్ ఎజెండాను ఆమోదించారు.

Indrakeeladri Temple: దుర్గమ్మ భక్తులకు శుభవార్త.. టీటీడీ తరహాలో ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు
Kanaka Durgamma temple
P Kranthi Prasanna
| Edited By: Surya Kala|

Updated on: Aug 29, 2023 | 10:39 AM

Share

ఇంద్రకీలాద్రి పాలకమండలి సమావేశంలో భక్తుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది పాలకమండలి. భక్తుల సౌకర్యార్థం ఏడాది లోపు చిన్నపిలల్లతో దర్శనాయికి వచ్చే భక్తులకు, వృద్దులకు, వికలాంగులకు దూరప్రాంత భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యనున్నారు. మొత్తం 113 అంశాలపై చర్చించి కీలకమైన అంశాలకు ఆమోద ముద్ర వేసింది పాలకమండలి. ఇప్పటికే టీటీడీ తరహాలో ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న శివాలయం పనులను కూడా దసరా ఉత్సవాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులో తీసుకుని వచ్చేలా నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా 40 లక్షల అంచనాతో శివాలయంకు ఉత్తర భాగాన గ్రానెట్ రాయితో నవగ్రహ మండపం నిర్మించటానికి ఆమోదముద్ర వేసింది.

కొండా దిగువన కనకదుర్గ నగర్ నుండి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్ నిర్మించటానికి లో కాస్ట్ టెండర్ కు, అన్నదాన భవనంలో ఒకేసారి 2 వేల మంది భక్తులు కూర్చుని భోజనం చేసే విధంగా భవనం నిర్మించటానికి, దూర ప్రాంతం నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనకదుర్గ నగర్ వద్ద ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులో ఒక డార్మెంటరీ ఏర్పాటు చేసి భక్తులు పడుకోవటానికి వీలుగా ఒక చాప, తలగడ ఇచ్చి నామినల్ చార్జిస్ వాసులు చేసే విధంగా నిర్ణయంగా తీసుకుంది. అంతే కాకుండా ఏడాది లోపు చిన్న పిలల్లతో వచ్చే భక్తులకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చెయ్యటానికి ఆమోద ముద్ర వేసింది. టీటీడీ తరహాలోనే ఇకపై ఇంద్రకీలాద్రిపై పెళ్లిళ్లు చేసుకునే వారికీ, పెళ్ళి చేసుకుని వచ్చే జంటకు ఏర్పాట్లు భద్రతా కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త పెళ్ళి జంటకు మేరేజ్ టికెట్ ఇవ్వనున్నారు. అంటే కాకుండా దుర్గమ్మను దర్శించుకోవటానికి వచ్చే వికలాంగ, వృద్ధ భక్తులకు ఇబ్బందులు కలగకుండా బ్రోకర్లు చేస్తున్న మోసాన్ని అరికట్టడానికి ఇకపై ఘాట్ రోడ్ కింద పైన తీసుకుని వెళ్ళి తీసుకుని రావటానికి డీజిల్ వెహికల్స్ ఏర్పాటు చెయ్యనున్నారు. అలాగే ఈశాన్యం వైవు మూత పడ్డ మెట్ల మార్గాన్ని కూడా తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఇవి మాత్రమే కాకుండా దగ్గర పడుతున్న దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా కొండా దిగువన తాత్కాలిక విద్యుత్ అలంకరణ ఏర్పాటు చెయ్యటానికి 60,00,000 అంచనాతో సర్క్యులేషన్ ఎజెండాను ఆమోదించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై అంచనా ఖర్చుతో క్యూలైన్స్, షామియానాలాంటి ఇతర భక్తుల సౌకర్యాల కోసం చర్చింది ఆమోదించింది. వీటన్నిటితో పాటు ఇకపై దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు కుంకుమ ప్రసాదాలు పంపిణి చెయ్యటానికి ట్రైల్ రాన్ కూడా నిర్వహించనుంది.

ఇవి కూడా చదవండి

అలాగే ఇంద్రకీలాద్రి స్థలపురాణం, తలకోన డాక్యుమెంటరీ భక్తులకు తెలిసేలా ఓ డాక్యుమెంటరీ తీసి సీడీల రూపంలో భక్తులకు ఇవ్వనున్నారు. దాంతో పాటు దుర్గ ఘాట్ లో స్నానాలు చేసే భక్తులకీ కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తు త్వరలో దుర్గ ఘాట్ ను భక్తులకు అందుబాటులోకి తీసుకుని వచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది. దుర్గ ఫ్లైఓవర్ పై లైటింగ్ తో దుర్గమ్మ ఫోటోలను ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు ఇంద్రకీలాద్రి ప్రాముఖ్యత, ఇంద్రకీలాద్రిపై జరిగే ప్రత్యేక పూజలు అందరికి తెలిసేలా టీడీడీ తరహాలో వాళ్లకు ఛానల్ ఉన్న విధంగానే sdmpc ఛానెల్ ను తీసుకుని వచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. యూ ట్యూబ్, సోషల్ మీడియాలో ఇంద్రకీలాద్రికి సంబంధించి ప్రత్యేకమైన ఛానెల్స్ ఏర్పాటు చేసి ప్రచారం చేసే విధంగా ఫోకస్ పెట్టనుంది. దీని ద్వారా దేశనలుమూలల ఉన్న దుర్గమ్మ భక్తులకు అమ్మవారి సేవలు అందుతాయని భావిస్తోంది. ఇవన్నీ కూడా దసరా నాటికి అమలై భక్తులకు అంబుబాటులో ఉండే విధంగా పనులు చేపట్టనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..