తస్మాత్ జాగ్రత్త.! ఇకపై స్కూల్స్, కాలేజెస్ పరిసరాల్లోని అవి విక్రయిస్తే అంతే సంగతి!
మత్తు పదార్థాల నిర్మూలనపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో మత్తు పదార్థాలకు బానిసలవుతున్న విద్యార్థులు, యువతను మార్చి వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కొత్త కార్యక్రమారికి శ్రీకారం చుట్టారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ పేరుతో స్కూల్, కాలేజెస్ పరిసరాల్లోని దుకాణాల్లో పొగాకు, ఇతర మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
- P Kranthi Prasanna
- Updated on: Jul 9, 2025
- 3:16 pm
డ్రైవరన్న జర భద్రం.. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆ జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం!
ఎక్కువగా రోడ్డుప్రమాదాలు రాత్రి పూటనే జరుగుతూ ఉంటాయి. ఇందుకు కారణం ఒకటి డ్రైవర్స్ నిద్రమత్తు, మరొకటి మద్యం సేవించి వాహనాలు నడపడం. చాలా వరకు నిద్రమత్తు కారణంగానే రాత్రి పూట రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు స్టాప్, రీప్రెష్ అండ్ గో అనే ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అసలేంటి ఈ స్టాప్, రీప్రెష్ అండ్ గో.. దీన్ని ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకుందాం పదండి.
- P Kranthi Prasanna
- Updated on: Jul 8, 2025
- 3:57 pm
AP Govt Jobs 2025: ఏపీ చేనేత, జౌళీ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద స్మాల్ క్లస్టర్ డెవలప్ మెంట్ కార్యక్రమంలో భాగంగా ఎగ్జిక్యూటీవ్ క్లస్టర్ డెవలప్ మెంట్, టెక్స్ టైల్ డిజైనర్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత , జౌళీ శాఖ ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం ఈ కింద తెలుసుకుందాం..
- P Kranthi Prasanna
- Updated on: Jul 8, 2025
- 11:53 am
Vijayawada: మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..
రైల్వే ఛార్జీలు పెరిగాయి. అమలులోకి వచ్చాయ్ కూడా.. విజయవాడలో పెరిగిన రైల్వే ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. మరి అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ రేట్ల వివరాలు.. ఆర్టికల్‌లో చూసేయండి మరి. ఓ సారి లుక్కేయండి ఇక్కడ లేట్ ఎందుకు.?
- P Kranthi Prasanna
- Updated on: Jul 3, 2025
- 12:56 pm
AP News: అమ్మబాబోయ్.! చింత చిగురు రేటు ఏంటి ఇంతలా పెరిగింది.. కేజీ ఎంతో తెల్సా
చింత చిగురు ధర ఏంటి ఇంతలా పెరిగింది.? ఒకప్పుడు రూ. 20 నుంచి రూ. 30 పలికే చింత చిగురు.. ఇప్పుడు ఏకంగా వందలు పలుకుతోంది. ఇలా తీసుకొచ్చిన కొద్ది క్షణాల్లోనే అమ్ముడైపోతోంది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.
- P Kranthi Prasanna
- Updated on: Jul 3, 2025
- 12:28 pm
Andhra: QR కోడ్ స్కాన్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి.. ఏమాత్రం తేడా ఉన్నా చర్యలే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రవేశ పెట్టింది కూటమి ప్రభుత్వం.. ఇకపై ప్రతి రేషన్ డిపో వద్ద QR కోడ్ పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. రేషన్ కార్డుదారులు ఆ QR కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చు..
- P Kranthi Prasanna
- Updated on: Jun 26, 2025
- 1:02 pm
Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై కొండపైకి వెళ్లకుండానే దర్శన టికెట్లు పొందొచ్చు!
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. భక్తులు కొండపైన ఉన్న ఆలయానికి వెళ్లే ముందే బస్టాండ్, రైల్వే స్టేషన్‌ల వద్దనే దర్శన టికెట్లు తీసుకునేలా దేవస్థాన కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ దేవస్థాన కౌంటర్లలో టికెట్ల విక్రయంతో పాటు, విరాలాల సేకరణ, లడ్డూ ప్రసాదం, విక్రయాలు కూడా జరుపుతున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. టికెట్ల కోసం ఇబ్బందిపడే, కొండపైకి రాలేని భక్తుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
- P Kranthi Prasanna
- Updated on: Jun 21, 2025
- 2:08 pm
కృష్ణమ్మ ఒడ్డున జల యోగాసనాలు.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు!
యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా, అవనిగడ్డలోని నాగాయలంక వద్ద కృష్ణానదిలో 188 మంది జల యోగాసనాలు చేశారు. రెబ్బా పోతన శాస్త్రి సూచనల మేరకు వివిధ ఆసనాలు ప్రదర్శించారు. ఈ అరుదైన కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది. దివ్యాంగులు, చిన్నారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- P Kranthi Prasanna
- Updated on: Jun 19, 2025
- 2:42 pm
Andhra: తల్లికి వందనం పడిందా అని అడిగారు.? ఒక్క ఫోన్ కాల్‌తో అంతా పాయే
సమాజంలో రోజు రోజుకు వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో..
- P Kranthi Prasanna
- Updated on: Jun 18, 2025
- 2:06 pm
Cyber Scams: సైబర్ మోసాలపై అప్రమత్తం కండి.. అలాంటి లింక్స్‌ను క్లిక్ చేశారో.. ఇక అంతే సంగతులు!
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. టెక్నాలజీతో పాటు సైబర్ నేరాల కూడా వేగంగానే పెరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ దాడులు జరగడం అనేది నేడు సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఇలానే ఓ రైతు తన ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేయడంతో తన బ్యాంక్ ఖాతాలోని డబ్బులు పొగొట్టుకున్నాడు. కాగా ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అవేంటో తెలసుకుందాం పదండి..
- P Kranthi Prasanna
- Updated on: Jun 17, 2025
- 6:52 pm
Vijayawada: పెళ్లై 5 రోజులు అయినా భర్తను ముట్టుకోనివ్వని భార్య – గట్టిగా నిలదీయడంతో అసలు ట్విస్ట్
పెళ్లి వయస్సు దాటిపోతుంది. అసలే సంబంధాలు రావటం లేదు. ఇక చేసేది లేక బ్రోకర్లను ఆశ్రయించాడు ఆ పెళ్ళికొడుకు. కానీ అదే అతని కొంప ముంచింది. ఇళ్లు అద్దెకు తీసుకున్నట్లు పెళ్ళాం అద్దెకు వచ్చింది. వినటానికి కాస్త విడ్డూరంగా ఉన్న అదే నిజం. డబ్బుకు కక్కుర్తి పడి బ్రోకర్లు ఆడిన ఆటలో బలిపశువయ్యాడు ఆ పెళ్ళికొడుకు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ మహిళ 10 వేలకు ఆశ పడి వాళ్ళతో చేతులు కలిపింది. పెళ్ళి చేసుకున్నాక పారిపోదాం అనుకుంది కానీ అవకాశం లేకపోవటంతో.. ఐదేళ్ళ కొడుకు కోసం అసలు విషయం బయట పెట్టింది. దాంతో కంగుతిన్న ఆ నవ వరుడు పెళ్లైన నాలుగు రోజులకే న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు.
- P Kranthi Prasanna
- Updated on: Jun 16, 2025
- 2:45 pm
Andhra Pradesh: ఖరీఫ్ పంట పక్కాప్రణాళిక .. తుఫాను ముప్పు తప్పేలా ముందుగానే సాగునీరు
గత 20 ఏళ్లుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ 14 తుఫాన్లను ఎదుర్కొంది. 365 రోజులు సాగుభూములు పచ్చగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది వ్యవసాయ శాఖ... ఇందుకోసం 3 పంటల విధానం తీసుకురావాలనేయోచనలో ఉంది ప్రభుత్వం. వరి రైతుకు ఆదాయం మరింత పెరిగే మార్గాలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. వరిలో అంతర పంటగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చెయ్యనున్నారు
- P Kranthi Prasanna
- Updated on: Jun 10, 2025
- 5:22 pm