AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andra Pradesh: ఇకపై చేనేత వస్త్రాల డోర్ డెలివరీ.. ఈ కామర్స్‌కు 40 ఆప్కోషో రూమ్‌లు అనుసంధానం

నేటితరం అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పోచంపల్లి, ధర్మవరం, మంగళగిరి పట్టు చీరలతో పాటు రెడీమేడ్ దుస్తులను కూడా ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. యువత, మహిళ, చిన్న పిల్లలు.. ఇలా వర్గాల వారిని ఆకట్టుకునేలా చేనేత రెడీమేడ్ దుస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంచింది. 

Andra Pradesh: ఇకపై చేనేత వస్త్రాల డోర్ డెలివరీ.. ఈ కామర్స్‌కు 40 ఆప్కోషో రూమ్‌లు అనుసంధానం
Apco Ties Up With Ecommerce
P Kranthi Prasanna
| Edited By: |

Updated on: Sep 04, 2025 | 1:21 PM

Share
వినియోగదారులకు చేనేత దుస్తులను మరింత చేరువ చేయడానికి ఆప్కో ద్వారా డోర్ డెలివరీ సదుపాయం ఇకపై అందుబాటులోకి రానుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థల ద్వారా అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 40 ఆప్కో షోరూమ్ లను సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం.

చేనేత వస్త్రాల డోర్ డెలివరీ

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఈ కామర్స్ దే హవా… ఇంటి దగ్గర నుంచే ఇంటికి, తమకు అసవరమైన వస్తువులు, సరకులను ఈ కామర్స్ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేసుకుంటున్నారు. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా, నేతన్నలు నిలదొక్కుకోడానికి ఈ కామర్స్ లోకి రాష్ట్ర ప్రభుత్వం అడుగుపెట్టింది. చీరలు, దోతీలతో పాటు రెడీమేడ్ చేనేత వస్త్రాలను ఈ కామర్స్ లో లభించేలా విక్రయాలు ప్రారంభించింది. నేరుగా ఇళ్ల వద్దకే చేనేత వస్త్రాలను డోర్ డెలివరీ చేసేలా వ్యవస్థను రూపొందించింది. చాలా తక్కువ కాలంలోనే ఆన్ లైన్ ద్వారా 45 లక్షల విలువైన చేనేత వస్త్రాలు అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాలను మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కామర్స్ లో చేనేత వస్త్రాల లభ్యతపై విశేష ప్రచారం ప్రారంభించింది.

ఈ కామర్స్ కు 40 ఆప్కో షో రూమ్ ల  అనుసంధానం

రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆప్కో ద్వారా చేనేత అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్టంతో పాటు దేశ వ్యాప్తంగా 92 ఆప్కో షో రూమ్ లున్నాయి. గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత పుట్టపర్తి, ప్రొద్దుటూరు, టెక్కలి, ఎమ్మగనూరు, అనకాపల్లిలో అయిదు షో రూమ్ లను ప్రారంభించింది.. చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి అనుగుణంగా  40 ఆప్కో షో రూమ్ ల ద్వారా ఆన్ లైన్ లో చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రారంభించింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, జియో మార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలకు ఈ 40 ఆప్కో షో రూమ్ లను అనుసంధానం చేసింది.

నూతన డిజైన్లతో చేనేత రెడీమేడ్ దుస్తులు

చేనేత అనగానే అందరికీ గుర్తుకొచ్చేది చీరలు, తువాళ్లు, లుంగీలు, దుప్పుట్లు, షర్ట్ బిట్లు. ప్రస్తుత తరం అభిరుచులకు అనుగుణంగా, అన్ని వర్గాల వారికి నచ్చేలా నూతన డిజైన్లతో రెడీమేడ్ చేనేత వస్త్రాలను తయారు చేసి, అమ్మకానికి పెట్టింది. ఇందుకోసం పలువురు డిజైనర్లను సైతం ప్రభుత్వం నియమించింది. వధూ వరులకు అవసరమైన దోతీలు, మోడి జాకట్లు, చీరలు, షర్టులు, లెనిన్ షర్ట్ లతో పాటు నేటి యువతను ఆకట్టుకునేలా కుర్తాలు, షార్ట్ కుర్తాలను సైతం అమ్మకాలు చేస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా సరిపడేలా గౌన్లు, ఇతర దుస్తులను కూడా కొత్త కొత్త డిజైన్లతో సిద్ధం చేసి విక్రయాలు చేస్తోంది. కలంకారీ చీరలు, పెన్ కలంకారీ చీరలు, డిజిటల్ ప్రింటెడ్ చీరలు, ఎంబ్రాయిడింగ్ చీరలను కూడా ఆప్కో షో రూమ్ లతో పాటు ఆన్ లైన్ లోనూ విక్రయిస్తున్నారు.  దాంతో విక్రయాలు ఘణనీయంగా పెరిగాయి.  అలాగే చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ పెరిగి, నేతన్నలకు ఆర్థిక భరోసా లభిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !