AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పిపోయిన బాలుడు.. గంటల్లోనే తల్లి చెంతకు చేర్చిన శక్తి టీం.. ఎలా కనిపెట్టారంటే!

విజయవాడలోని మహిళ శక్తి టీం.. మహిళలు, బాలికల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్న క్రమంలో.. తల్లి నుంచి తప్పిపోయి రోడ్డుపై తిరుగుతున్న బాలుడిని గుర్తించింది.. కేవలం తల్లి పేరు మినహా బాలుడు ఎలాంటి వివరాలు చెప్పకపోయినప్పటికీ గంటల వవ్యధిలోనే తల్లి ఆచూకీ గుర్తించి బాలుడిని సురక్షితంగా తల్లి చెంతకు చేర్చింది.

తప్పిపోయిన బాలుడు.. గంటల్లోనే తల్లి చెంతకు చేర్చిన శక్తి టీం.. ఎలా కనిపెట్టారంటే!
Shakti Team
P Kranthi Prasanna
| Edited By: Anand T|

Updated on: Aug 11, 2025 | 6:23 PM

Share

మహిళలు, బాలికల రక్షణ కోసం కల్పించబడుతున్న మహిళా చట్టాల గురించి మహిళలు, విధ్యార్ధినీ విధ్యార్ధులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తి టీంలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్.టి.ఆర్. పోలీసు కమిషనరేట్ పరిదిలోని శక్తి టీం బృంధాలు, మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు సోమవారం మధ్యాహ్నం పి.ఎన్.బి.ఎస్. ఏరియాలో మహిళా చట్టాలు, శక్తి యాప్‌లపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో వారికి తప్పిపోయి రోడ్డుపై తిరగుతున్న ఒక బాలుడు కనిపించాడు. దీంతో బాలుడుని అదుపులోకి తీసుకున్న శక్తి టీం.. అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ బాలుడు తల్లి పేరు మాత్రమే చెప్పాడు. అడ్రెస్ చెప్పలేకపోయాడు. దీంతో బాలుడు ఎవరికైనా తెలుసా అని చుట్టుపక్కల వారిని శక్తి టీం విచారించారు. అక్కడ ఎవ్వరూ తెలియదు అని చెప్పడంతో వెంటనే పై అధికారులకు సమాచారం అంధించి బాలుడిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాక.. బాలుడిని కూర్చోపెట్టి మరోసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సారి కూడా బాలుడు తల్లి పేరు మాత్రమే చెప్పాడు. అయితే ఎక్కడకి వచ్చారు అని శక్తి టీం అడుగగా హాస్పిటల్‌కు వచ్చినట్లు బాలుడు చెప్పాడు. దీంతో దగ్గర్లోని పాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన శక్తి టీం బాలుడి తల్లి గురించి విచారించి ఆమె అక్కడే ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆ తర్వాత బాలుడిని క్షేమంగా తల్లికి అప్పగించారు.

ఈ క్రమంలో బాలుడి తల్లి మాట్లాడుతూ.. తన భర్త చనిపోయాడని, తన ముగ్గురు పిల్లలతో కలిసి విజయవాడలోని చిట్టినగర్ ఏరియాలో నివాసం ఉంటున్నట్టు తెలిపింది. ఇటీవల ఇద్దరు పిల్లలు అనారోగ్యం బారిన పడడంతో వారి చికిత్స కోసం పాత ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినట్టు చెప్పింది. పిల్లలకు చికిత్స చేయిస్తున్న క్రమంలో తనతో పాటు ఉన్న రెండవ బాబు కనిపించకుండా పోయాడని.. బాలుడి కోసం చుట్టుపక్కల విచారించి ఏం చెయ్యాలో తెలియని సమయంలో విజయవాడ శక్తి బృంధం బాబుని తీసుకువచ్చి అప్పగించిందని ఆమె తెలిపింది. ఈ మేరకు ఆ తల్లి పోలీసులకు కృతజ్ఞతలు చెప్పింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.