AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: దేవుడ్ని మొక్కేందుకు వచ్చిన భక్తులు.. గర్భగుడిలో కనిపించిన సీన్‌ చూసి..

కర్నూలు జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దేవుడికి భక్తులకు వారధిగా ఉండాల్సిన పూజారి.. ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టాడు. మరి అసలు అతడేం చేశాడో.? ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? ఓ సారి మీరూ ఇక్కడ లుక్కేయండి మరి

Andhra: దేవుడ్ని మొక్కేందుకు వచ్చిన భక్తులు.. గర్భగుడిలో కనిపించిన సీన్‌ చూసి..
Representative Image
J Y Nagi Reddy
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 11, 2025 | 7:03 PM

Share

కంచె చేను మేస్తే.. కర్నూలు జిల్లాలో అదే జరిగింది. ఎవరికైనా ఆపద వస్తే.. లేదా ప్రమాదం జరగొద్దని, మంచి జరగాలని ఆలయానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాం. పూజారితో పూజలు చేయించుకుంటాం. భగవంతుడికి, భక్తుడికి మధ్య పూజారికి అంతటి బంధం ఉంటుంది. అలాంటి దేవుడి ప్రాశస్త్యాన్ని కాపాడాల్సిన పూజారి.. ఆ దేవుడికే శఠగోపం పెడితే.. అదే జరిగింది. ఎక్కడ ఎలా జరిగిందంటే.?

వివరాల్లోకి వెళ్తే..  కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురంలోని శ్రీ వసిగేరప్ప దేవాలయంలో పది రోజుల నుంచి ఆభరణాలు కనపడకపోవడంతో.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారని గుడికి సంబంధించిన సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆగష్టు 10న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉంటే ఆభరణాలను సుమారు 10 రోజులు కిందట ఎవరికి తెలియకుండా ఎత్తుకెళ్లి నారాయణపురం గ్రామంలోని తన ఇంటిలో దాచి ఉంచాడు పూజారి కురువ గొర్రెల వసిగేరప్ప. ఇక ఈ చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించి గుడి పూజారి కురువ గొర్రెల వసిగేరప్ప హస్తం ఉన్నట్టు గుర్తించారు. ఆపై అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు రూ. 5,99,000 విలువైన 4.386 కిలోల వెండి, 10 గ్రాముల బంగారం ఆభరణాలను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మట్కా ఆడి అప్పులు తీర్చడం కోసమే పూజారి ఈ దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నాడని స్థానిక డీఎస్పీ తెలిపింది. ఆభరణాలను అమ్మేందుకు బళ్లారికి వెళ్తుండగా చాగి గ్రామం వద్ద పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కేసును వేగంగా పరిష్కరించినందుకు తాలూకా సీఐ నల్లప్ప, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇది చదవండి: పొట్ట బొండంలా ఉబ్బిపోయి ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. టెస్టులు చేయగా..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి