Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబ్ బెదిరింపు.. అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది..
ఎయిర్‌పోర్టును పేల్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు అగంతకులు మెయిల్ చేశారు. ఎయిర్‌పోర్టులో బాంబు ఉందని, ఏ క్షణమైనా పేలొచ్చంటూ బెదిరింపు మెసేజ్ చేశారు. దాంతో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అలర్ట్ అయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. ప్రయాణికులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు బాంబుకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని అధికారులు చెబుతున్నారు. ఇందుకు..
నిత్యం వేలాది మంది ప్రయాణికులతో హడావిడిగా ఉండేటటువంటి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బాంబు బెదిరింపు భయాందోళనకు గురిచేస్తుంది. తరచూ వందలాదిమంది భద్రతా బలగాల సిబ్బంది పట్టిష్టమైన బందోబస్తును నిర్వహించినా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా అధికారులంతా అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి 11:50 గంటలకు RGIA కస్టమ్స్ మెయిల్ కు ఎయిర్పోర్ట్‌లో బాంబు ఉన్నట్లు మెయిల్ వచ్చింది. అది గమనించిన అధికారులు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్జిఐ పోలీసులను ఆశ్రయించారు.
అయితే terrorist@ gmail.com తో పాటుగా మరొక మెయిల్ నుంచి కూడా ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా గుర్తించారు. ఇంతకీ ఈ మెయిల్ పెట్టిన వ్యక్తి ఎవరు అనేది అనుమానాస్పదంగా మారింది. దీంతో భద్రతను మరింత పటిష్టం చేశారు అధికారులు. ప్రయాణికులు వెళ్లేటటువంటి ప్రతి యొక్క బ్యాగులతో సహా వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డాగ్స్ స్క్వాడ్ తో పాటు బాంబు స్క్వాడ్ టీంలు రంగంలోకి దిగి ప్రతి ఒక్క ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్‌తో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇక సమాచారం అందుకున్న పోలీసులు సైతం రంగంలోకి దిగి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చే వాహనాలు, ప్రయాణికులను, లగేజ్ లతో పాటు ఎయిర్‌పోర్టులో ఉన్న ప్రతి ఒక్క షాపులతోపాటు అన్ని ప్రాంతాలను చెక్ చేశారు. అయితే ఇది కావాలని ఎవరైనా చేశారా? ఈ మెయిల్ పెట్టిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి పెట్టారు? అన్న దానిపై కూపీ లాగారు పోలీసులు.
ఫేక్ మెయిల్..
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పెట్టాడు. ఆ మెయిల్‌లో రాత్రి 7గంటలకు బాంబు పేలుతుందని చెప్పారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ తో ఎయిర్ పోర్ట్ మొత్తం తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా బాంబు ఆచూకీ లభ్యం కాకపోవటంతో ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు. అయితే కొద్దిసేపటికే అదే ఐడీతో ఎయిర్‌పోర్ట్ అధికారులకు మరో మెయిల్ వచ్చింది. తప్పు జరిగిందని, తన కుమారుడు ఫోన్‌తో ఆడుకుంటూ మెయిల్ పెట్టాడన్నారు. తనను క్షమించాలని కోరాడు. బాంబు బెదిరింపు అంతా ఫేక్‌గా తేలడంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..