- Telugu News Photo Gallery Mistakes that Should Avoid after Eating Food, Or else you may face these health problems
Health Tips: భోజనం తర్వాత చేయకూడని తప్పులు.. చేశారంటే ఆ దీర్ఘకాలిక సమస్యలు తప్పదంటున్న నిపుణులు..!
Health Tips: చాలా మందికి భోజనం చేసిన తర్వాత వెంటనే నిద్రించే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణం కాదు, ఫలితంగా బరువు పెరుగుతారు, ఇంకా శరీరానికి పోషకాలు లభించవు. భోజనం తర్వాత మనం తరచూ చేసే తప్పు ఇదొక్కటే కాదు, మరి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అందువల్ల ఆయా తప్పులను చేయకుండా ఉండడమే ఆరోగ్యానికి మంచిదని, లేకుంటే సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ భోజనం తర్వాత చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Aug 29, 2023 | 8:59 PM

టీ: టీ తాగడం వల్ల నరాలు ఉత్తేజితమై కొత్త శక్తి లభించినట్లు ఉంటుంది. అయితే భోజనం తర్వాత టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు గ్యాస్ట్రిక్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది.

స్నానం: స్నానం చేయడం వల్ల శరీరంలో కొత్త ఉత్సాహం కలుగుతుంది. అయితే స్నానం తర్వాత భోజనం చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, రక్త ప్రసరణ సమస్యలు వస్తాయి. ఇంకా మెదడుకు మత్తు అనుభూతి కలుగుతుంది.

పండ్లు: అరటి, మామిడి వంటి పండ్లను కొందరు భోజనం సమయంలోనే తీసుకుంటారు. అలా చేయడం వల్ల కూడా జీర్ణ సమస్యలు కలుగుతాయి. భోజనం, పండ్లు జీర్ణమయ్యే వేగం వేర్వేరుగా ఉంటుంది. ఈ కారణంగానే భోజనం తర్వాత పండ్లను తీసుకోకూడదు. భోజనం తర్వాత కనీసం రెండు గంటల సమయం అయినా ఆగి తీసుకోవాలి.

ధూమపానం: ధూమపానం ఏ సమయంలో అయినా ఆరోగ్యానికి హానికరమే. అయితే అలవాటు ఉన్నవారు భోజనం తర్వాత ధూమపానం చేస్తే అది మరింత ప్రాణాంతకం. ఎందుకంటే తిన్న తర్వాత ఒక సిగరెట్ కాలిస్తే 10 సిగరెట్లు తాగడంతో సమానమని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ఊపిరితిత్తులు, గుండె త్వరగా ప్రభావితం అవుతాయి, కనుక భోజనం తర్వాత ధూమపానం చేయకండి.

నీరు: భోజనం తర్వాత కనీసం అరగంట వరకు నీరు కూడా తాగకూడదు. నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడి, ఆహారం జీర్ణం కాకుండా పోషకాలు నీటిలో కరిగిపోతాయి. ఫలితంగా అవి మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోయి, శరీరంలో పోషక లోపం ఏర్పడే పరిస్థితి ఎదురవుతుంది.





























