AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice Balls Recipe: అన్నం మిగిలిపోయిందా.. అయితే ఇలా రైస్ బాల్స్ చేసుకోండి!!

అప్పుడప్పుడు వండిన అన్నం మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలిపోయిన అన్నాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఇంట్లలో అమ్మలు, అమ్మమ్మలు ఉంటే వాటిని తింటారు. మరికొంత మంది పారేస్తూ ఉంటారు. ఇలా మిగిలిపోయిన అన్నాన్ని పారేయకుండా ఆ అన్నంతో స్నాక్స్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో రైస్ రసగుల్లా ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాం.. ఇప్పుడు ఆ అన్నంతో రైస్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలతో తెలుసుకుందాం. ఇవి కూడా చాలా రుచిగా..

Rice Balls Recipe: అన్నం మిగిలిపోయిందా.. అయితే ఇలా రైస్ బాల్స్ చేసుకోండి!!
Rice Ball Recipe
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 09, 2023 | 8:00 PM

Share

అప్పుడప్పుడు వండిన అన్నం మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలిపోయిన అన్నాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఇంట్లలో అమ్మలు, అమ్మమ్మలు ఉంటే వాటిని తింటారు. మరికొంత మంది పారేస్తూ ఉంటారు. ఇలా మిగిలిపోయిన అన్నాన్ని పారేయకుండా ఆ అన్నంతో స్నాక్స్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన అన్నంతో రైస్ రసగుల్లా ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాం.. ఇప్పుడు ఆ అన్నంతో రైస్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలతో తెలుసుకుందాం. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటితో రైస్ బాల్స్ చేసుకోవడం చాలా ఈజీ. మరి అది ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి.

రైస్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు:

అన్నం – ఒక కప్పు, కొబ్బరి తురుము – అర కప్పు, బియ్యం పిండి – అరకప్పు, ఉల్లిపాయ – ఒకటి, పాలకూర – ఒక కట్ట, పచ్చిమిర్చి – ఒకటి, అల్లంపేస్ట్ – తగినంత, ఉప్పు – రుచికి సరిపడినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడగా

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ఒక గిన్నెలో అన్నం వేసి, అందులో బియ్యం పిండి, కొబ్బరి తురుము వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. వాటిలో ఉప్పు, అల్లం పేస్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాక.. తరిగి పెట్టుకున్న  పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నీళ్లు  కూడా పోసి బాగా కలుపుకోవాలి.  ఈ మిశ్రమం జారుగా కాకుండా గట్టిగా ఉండేలా చూసుకోవాలి.  ఆ తర్వాత వాటిని చిన్న బాల్స్ లా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక.. ఈ బాల్స్ ను అందులో వేసి.. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకూ వేయించుకుని తీసుకోవాలి. అంతే వేడి వేడి రైస్ బాల్స్ రెడీ. వీటిని కెచప్ తో కానీ, అల్లం చెట్నీతో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నం మిగిలిపోయినప్పుడగా పారేయకుండా ఇలా స్నాక్స్ చేసుకోవచ్చు. అలాగే కొత్త స్నాక్ తిన్నట్టు ఉంటాయి. మిగిలిపోయిన అన్నంతో ఇవే కాదు.. ఇంకా ఎన్నో వంటకాలు ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకుందాం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..