Kitchen Hacks: కాయగూరలు-పండ్లు ఫ్రెష్ గా ఉండాలా.. కర్రీ అడుగంటి పోయిందా ఇలా చేయండి!!

వంట గది మహిళల సామ్రాజ్యం. ఉదయం లేచింది మొదలు.. రాత్రి వరకూ కిచెన్ లో పని ఉంటూనే ఉంటుంది. దానికి తోడు పండగలు వచ్చాయంటే.. ఆ పని డబల్ అవుతుంది. ఒక్కోసారి అన్నీ చిందర వందరగా పడిపోతూ ఉంటాయి. ఇళ్లంతా ఒక్క ఎత్తు అయితే.. కిచెన్ మరో ఎత్తు. ఎంత తొందరగా ముగిద్దామనుకున్నా.. ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుంది. ఇలాంటి లేడీస్ కి ఎంతో ఈజీగా ఉండేలా మంచి మంచి టిప్స్ తెలుసుకుంటున్నాం. తాజాగా మరో కొన్ని టిప్స్ ని మీకోసం..

Kitchen Hacks: కాయగూరలు-పండ్లు ఫ్రెష్ గా ఉండాలా.. కర్రీ అడుగంటి పోయిందా ఇలా చేయండి!!
Kitchen
Follow us
Chinni Enni

|

Updated on: Aug 29, 2023 | 3:43 PM

వంట గది మహిళల సామ్రాజ్యం. ఉదయం లేచింది మొదలు.. రాత్రి వరకూ కిచెన్ లో పని ఉంటూనే ఉంటుంది. దానికి తోడు పండగలు వచ్చాయంటే.. ఆ పని డబల్ అవుతుంది. ఒక్కోసారి అన్నీ చిందర వందరగా పడిపోతూ ఉంటాయి. ఇళ్లంతా ఒక్క ఎత్తు అయితే.. కిచెన్ మరో ఎత్తు. ఎంత తొందరగా ముగిద్దామనుకున్నా.. ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుంది. ఇలాంటి లేడీస్ కి ఎంతో ఈజీగా ఉండేలా మంచి మంచి టిప్స్ తెలుసుకుంటున్నాం. తాజాగా మరో కొన్ని టిప్స్ ని మీకోసం తీసుకొచ్చాం. మరి అవేంటో ఓ లుక్కేసేయండి.

కర్రీ అడుగంటుకుందా:

ఒక్కోసారి ఏదైనా పని ఉన్నప్పుడు కర్రీని సిమ్ లో పెడుతాం. ఆ తర్వాత దాని సంగతే మర్చిపోతాం. ఇలాంటి సమయాల్లో అవి అడగంటి పోతాయి. ఈ సమయంలో రెండు, మూడు ఐస్ క్యూబ్స్ ని వేసి కరిగేంత వరకు తిప్పాలి. ఇలా చేస్తే పాత్రకు అంటుకున్నది విడిపోయి కూర అడుగంటకుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నూనె పడిందా:

వంట గదిలో నూనె వొలికితే.. గాబరా పడకుండా దానిమీద కాస్త గోధుమ పిండి చల్లండి. గోధుమ పిండి అవైలబుల్ లేకపోతే బియ్యం పిండి అయినా పర్లేదు. ఐదు నిమిషాల తర్వాత పేపర్ తో తుడిస్తే నూనె పడిన ప్రాంతం జిడ్డు లేకుండా శుభ్రంగా ఉంటుంది.

డోర్లు శబ్దం వస్తున్నాయా:

వర్షాకాలంలో తేమను పీల్చుకుని డోర్లు.. కిర్రు కిర్రుమని శబ్దాలు వస్తాయి. ఇలాంటప్పుడు డోర్లను పట్టి ఉంటే బోల్టుల వద్ద కొద్దిగా టాల్కమ్ పౌడర్ ని చల్లడం లేదా కొవ్వొత్తిని రుద్దడం వల్ల ఆ శబ్దాలు రావు.

పండ్లు-కాయగూరలు ఫ్రెష్ గా:

వర్షాకాంలో పండ్లు, కాయగూరలు త్వరగా కుళ్లిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు వేడి నీళ్లలో రెండే టేబుల్ స్పూన్ల వెనిగర్ ను వేసి కలపాలి. ఈ నీటిలో పండ్లను, కాయగూరలు కాసేపు ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడిగేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేస్తే కాయగూరలు, పండ్లు త్వరగా పాడవ్వవు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి