Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Memory Enhancing Foods to Children: పిల్లలకు చదివింది గుర్తుండాలా.. అయితే ఈ ఆహారాలను ఇవ్వండి!!

పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయంటే.. వారితో పాటు తల్లిదండ్రులు కూడా జాగారం చేస్తూంటారు. అలాంటి పిల్లలకు చదివింది బాగా జ్ఞాపకం ఉంటేనే పరీక్షల్లో రాయగలుతారు. లేదంటే పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తాయి. దీంతో పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా నిరాశకు గురవుతారు. ఇందు కోసం పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచే ఆహారాలను ఇవ్వాలి. కొన్ని రకాల ఆహారాలను తరచూ పిల్లలకు ఇవ్వడం ద్వారా వారి ఏకాగ్రత పెరగడమే కాకుండా, జ్ఞాపక శక్తి కూడా మెరుగవుతుందని..

Memory Enhancing Foods to Children: పిల్లలకు చదివింది గుర్తుండాలా.. అయితే ఈ ఆహారాలను ఇవ్వండి!!
Memory Enhancing Foods to Children
Follow us
Chinni Enni

|

Updated on: Aug 29, 2023 | 3:43 PM

పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయంటే.. వారితో పాటు తల్లిదండ్రులు కూడా జాగారం చేస్తూంటారు. అలాంటి పిల్లలకు చదివింది బాగా జ్ఞాపకం ఉంటేనే పరీక్షల్లో రాయగలుతారు. లేదంటే పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తాయి. దీంతో పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా నిరాశకు గురవుతారు. ఇందు కోసం పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచే ఆహారాలను ఇవ్వాలి. కొన్ని రకాల ఆహారాలను తరచూ పిల్లలకు ఇవ్వడం ద్వారా వారి ఏకాగ్రత పెరగడమే కాకుండా, జ్ఞాపక శక్తి కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటి? ఎలా తీసుకోవాలి? ప్రయోజనాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ద్రాక్ష-బెర్రీ పండ్లు: ఎరుపు ద్రాక్ష పండ్లు, నీలం, ఊదా రంగు బెర్రీ పండ్లు జ్ఞాపక శక్తిని పెంచడానికి అద్భుతంగా పని చేస్తాయి. పండ్లు తినని పిల్లలకు జ్యూస్ లు అయినా ఇవ్వొచ్చు. అలాగే అల్జీమర్స్ బారిన పడుతున్న వృద్ధులకు కూడా ఇవి బాగా పని చేస్తాయి. ద్రాక్ష, బెర్రీలలో జ్ఞాపక శక్తిని పెంచే లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిల్లో ఆంథియో సైనైన్స్ అనే పాలిఫనాల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వాటికి ఈ పండ్లకు ముందురు రంగు వస్తుంది. ఇవి మెదడును చురుకుగా పని చేసేలా చేస్తాయి. నరాలు ఉత్తేజితమవుతాయి.

బ్రేక్ ఫాస్ట్ అస్సలు మిస్ చేయకూడదు: పిల్లలు ఉదయం పూట తినే బ్రేక్ ఫాస్ట్ ను ఎప్పుడూ మిస్ చేయకుండా చూడాలి. ఇది ఆ రోజంతా జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు సహాయపడతాయి. అలాగే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరగడానికి హెల్ప్ చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా చేసే పిల్లలు.. చదవుల్లో బాగా రాణిస్తారని కూడా ఒక అధ్యయనం వివరించింది. అలాగే కొవ్వుతో కూడాని చేపలు తినడం చాలా ముఖ్యం. వాటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి సహకరిస్తాయి.

ఇవి కూడా చదవండి

నట్స్ తప్పనిసరి: ఎండు ద్రాక్ష, వాల్ నట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా వంటివి రోజూ పిల్లలకు ఇస్తూ ఉండాలి. వీటిలో కూడా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటితో పాటు సెలీనియం, రాగి, మాంగనీస్ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ కూడా నాడులు సవ్యంగా పని చేయడానికి అత్యవసరం. ఏకాగ్రతతో పాటు మానసిక స్థితిని కూడా ఇవి మెరుగు పరుస్తాయి.

బ్రౌన్ రైస్: అలాగే బ్రౌన్ రైస్ ను కూడా పిల్లలకు తినిపిస్తూ ఉండాలి. ఇవి గుండె, మెదడు పని తీరును మెరుగు పరుస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా సాగితే మెదడు చురుగ్గా ఉంటుంది.

కోడి గుడ్డు: రోజు కోడి గుడ్డును కూడా పిల్లలకు ఇస్తూ ఉండాలి. కోడి గుడ్డులో ఉన్న ప్రొటీన్స్ అన్నీ పిల్లలకు అందుతాయి. గుడ్డులో కొలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది మెదడులో సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. సెరటోనిన్ వల్ల మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. దీని వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి