Onam Sadya Benefits: పవర్ ఫుల్ ఫుడ్ ‘ఓనమ్ సద్యా’.. ఈ ఒక్క భోజనంతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు!
కేరళ ప్రజలకు 'ఓనమ్' అనేది పెద్ద పండుగ. తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి ఎంత ప్రత్యేకతనో.. కేరళలో కూడా ఓనమ్ కూడా అంత ప్రత్యేకత. కేరళలో పంటలు ఈ మాసంలోనే ఇంటికి వస్తాయి. ఇది పంటల పండుగ కూడా. ఈ ఫెస్టివల్ ను కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. పది రోజుల పాటు ఓనమ్ ను నిర్వహిస్తారు. ఈ పండుగ రోజుల్లో సధ్య పేరుతో సంప్రదాయ వంటలను వండుతారు. ఈ ఫెస్టివల్ లో చేసే ఓనం సద్యా అనేక విందు చాలా ముఖ్యమైనది. కొబ్బరి, బెల్లం..
కేరళ ప్రజలకు ‘ఓనమ్’ అనేది పెద్ద పండుగ. తెలుగు రాష్ట్రాల్లో దసరా, సంక్రాంతి ఎంత ప్రత్యేకతనో.. కేరళలో కూడా ఓనమ్ కూడా అంత ప్రత్యేకత. కేరళలో పంటలు ఈ మాసంలోనే ఇంటికి వస్తాయి. ఇది పంటల పండుగ కూడా. ఈ ఫెస్టివల్ ను కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. పది రోజుల పాటు ఓనమ్ ను నిర్వహిస్తారు. ఈ పండుగ రోజుల్లో సధ్య పేరుతో సంప్రదాయ వంటలను వండుతారు. ఈ ఫెస్టివల్ లో చేసే ఓనం సద్యా అనేక విందు చాలా ముఖ్యమైనది. కొబ్బరి, బెల్లం, కంద, ఉప్పేరి, షక్కర వరాట్టి, నారంగ, క్యాబేజీ, పెరుగు వంటి రకరకాల వాటితో 26 రకాలను చేసి అరిటాకులో వడ్డిస్తారు.
ఓనం సద్యాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓనం సద్యాలో తాజా కాయగూరలు, అలాగే ఆ సీజన్ లో లభించే వాటితో చేస్తారు. ఇందులో పుష్కలంగా మినరల్స్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే సధ్యా తింటే సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం లేదు. మరి ఈ ఓనం సద్యా ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఫైబర్ రిచ్ ఫుడ్స్:
ఓనం సద్యా వంటకాల్లో ఎక్కువగా కాయగూరలు, కొబ్బరి, ధాన్యాలు ఉపయోగిస్తారు. వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. హెల్దీ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మంచి కొవ్వులు:
సద్యాలో ఎక్కువగా కొబ్బరిని ఉపయోగిస్తారు. కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
సమతుల్య పోషకాలు:
ఓనం సద్యాను వివిధ రకాల కూరగాయలతో చేస్తారు. కాబట్టి ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. మంచి ప్రోటీన్ శరీరానికి లభిస్తుంది.
మసాలాలు:
ఈ ఓనం సద్యాలో ఘాటైన మసాలాలు ఎక్కువగా ఉపయోగించరు. స్థానికంగా లభించే సుగంధ ద్రవ్యాలనే ఎక్కువగా వాడుతూంటారు. పసుపు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు వంటి మసాలాలు వాడతారు. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి