AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips for Happy Sleep: నిద్ర బాగా పట్టాలా.. అయితే నీటిలో ఈ నూనె వేసుకుని స్నానం చేయండి.. హాయిగా నిద్రపోండి!!

ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో హాయిగా నిద్ర పోవడానికి కూడా అదృష్టం ఉండాలి. బిజీ లైఫ్ కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నారు. నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆఫీసులో పని ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రోజాంతా సిస్టమ్ లేదా ల్యాప్ టాప్ ముందు కూర్చొవడం, పడుకునే సమయంలో ఫోన్లు చూడటం ఇలా చాలానే ఉంటాయి. పడుకునే సమయంలో ఫోన్లు చూస్తే.. కంటిలో నిద్ర పుచ్చే గ్రంథులు యాక్టీవ్ అవుతాయి. కాబట్టి పడుకునే సమయంలో ఫోన్ వీలైనంత దూరంగా ఉంచుకోవాలి. మనిషికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే..

Tips for Happy Sleep: నిద్ర బాగా పట్టాలా.. అయితే నీటిలో ఈ నూనె వేసుకుని స్నానం చేయండి.. హాయిగా నిద్రపోండి!!
Sleeping
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 09, 2023 | 8:30 PM

Share

ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో హాయిగా నిద్ర పోవడానికి కూడా అదృష్టం ఉండాలి. బిజీ లైఫ్ కారణంగా సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నారు. నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆఫీసులో పని ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రోజాంతా సిస్టమ్ లేదా ల్యాప్ టాప్ ముందు కూర్చొవడం, పడుకునే సమయంలో ఫోన్లు చూడటం ఇలా చాలానే ఉంటాయి. పడుకునే సమయంలో ఫోన్లు చూస్తే.. కంటిలో నిద్ర పుచ్చే గ్రంథులు యాక్టీవ్ అవుతాయి. కాబట్టి పడుకునే సమయంలో ఫోన్ వీలైనంత దూరంగా ఉంచుకోవాలి. మనిషికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే తీవ్ర అనారోగ్య పాలవ్వాల్సి వస్తుంది. అయితే హాయిగా నిద్ర పోవడానికి కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే సరి. మరి అవేంటో తెలుసుకుందామా.

లావెండర్ ఆయిల్:

రాత్రి పడుకునే ముందు వేడి నీళ్లల్లో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ వేసుకుని స్నానం చేస్తే.. ఫ్రెష్ గా, రిలీఫ్ గా ఉండటమే కాకుండా గాఢ నిద్ర పడుతుంది.

ఇవి కూడా చదవండి

పసుపు పాలు:

నిద్ర పట్టని వారైనా, ఎవరైనా సరే రాత్రిళ్లు పడకునే ముందు గోరు వెచ్చటి పాలల్లో కాస్త పసుపు వేసుకుని తాగితే మంచిది. నిద్ర పట్టడమే కాకుండా.. అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. పాలల్లో ఉండే మెలటోనిన్, సెరటోనిన్, పసుపులో ఉండే కర్కుమిన్ హార్మోన్లు ఒత్తిడిని తగ్గించి నిద్రపోవడానికి సహాయ పడతాయి.

అశ్వగంధ:

అశ్వగంధలో ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే గుణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఎలా తీసున్నా కూడా నిద్రకు సంబంధించి ప్రాబ్లమ్స్ అన్నీ దూరమవుతాయి.

నూనెతో మసాజ్:

రాత్రుళ్లు బాగా నిద్ర పట్టాలంటే.. పాదాలకు బాగా మసాజ్ చేసుకోవాలి. స్నానం చేశాక.. తడి కాళ్లు ఆరాక.. ఏదైనా గోరు వెచ్చటి నూనెతో కాసేపు పాదాలకు మసాజ్ చేస్తే.. హాయిగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడున్న నరాలన్నీ రిలాక్స్ అవుతాయి. రక్త ప్రసరణ కూడా జరుగుతుంది. దీంతో హ్యాపీగా నిద్ర పడుతుంది.

కెఫీన్ ఉన్నవి తినకపోవడం:

రాత్రి మీరు పడుకునే ముందు కాఫీ, టీలు తాగడం మానుకోవాలి. కెఫీన్ నిద్రని చెడగొడుతుంది. అలాగే పడుకునే ముందు ఎలాంటి ఆలోచనల్ని దరి చేరనివ్వకూడదు.

భోజనం చేశాక కాసేపు వాకింగ్ చేయాలి:

రాత్రి భోజనం చేశాక కాసేపు వాకింగ్ చేయడం చాలా మంచిది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అప్పుడు కడుపులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇది కూడా నిద్ర పోవడానికి సహాయ పడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి