Food Side Effects for Pet Dogs: మీ ఇంట్లో పెంపుడు కుక్క ఉందా.. అయితే జాగ్రత్త పొరపాటున కూడా ఇలాంటి ఆహారాలు పెట్టొద్దు!!
చాలా మంది ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. మరికొంత మందికి కుక్కలను పెంచడమే ఒక హాబీ. రకరకాల బ్రీడ్ లకు సంబంధించిన కుక్కలను తీసుకొచ్చి పెంచుకుంటూంటారు. కొంతమంది చిన్న పిల్లల్ని ఎలా చూస్తారో.. వాటిని కూడా అలానే చూస్తారు. అంత ఇష్టం కుక్కలంటే. అందులోనూ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కుక్కలు తప్పని సరిగా ఉంటాయి. కుక్కలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి కూడా మంచి డైట్ తప్పనిసరి. అది ఏ బ్రీడ్ కు సంబంధించిన కుక్క అయినా సరే.. మనం చూసే విధానం కూడా కరెక్ట్ గా..
చాలా మంది ఇళ్లల్లో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. మరికొంత మందికి కుక్కలను పెంచడమే ఒక హాబీ. రకరకాల బ్రీడ్ లకు సంబంధించిన కుక్కలను తీసుకొచ్చి పెంచుకుంటూంటారు. కొంతమంది చిన్న పిల్లల్ని ఎలా చూస్తారో.. వాటిని కూడా అలానే చూస్తారు. అంత ఇష్టం కుక్కలంటే. అందులోనూ చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో కుక్కలు తప్పని సరిగా ఉంటాయి. కుక్కలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి కూడా మంచి డైట్ తప్పనిసరి. అది ఏ బ్రీడ్ కు సంబంధించిన కుక్క అయినా సరే.. మనం చూసే విధానం కూడా కరెక్ట్ గా ఉండాలి. కొంత మంది కుక్కే కదా అని ఏది పడితే అది పెడతారు. ఎలా పడితే అలా ట్రీట్ చేస్తారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదు.
మనం రోజూ పని మీద బయటకు వెళ్లి వస్తూంటాం. ఇలా ఇంట్లోకి రాగానే అవి మన మీదకు వచ్చి ఎక్కుతాయి. అంటే అర్థం అవి మనల్ని చాలా మిస్ చేశాయని. ఇలా వాటికి వచ్చిన విధానంలో అవి మనపైన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేస్తాయి. మనిషికి ఎలా చిన్నా, పెద్ద, ముసలితనం అనే స్టేజ్ లు ఉంటాయో.. కుక్కలు కూడా స్టేజ్ లు ఉంటాయి. అలా ఒక్కో ఏజ్ లో ఒక్కో రకమైన ఫుడ్ పెడితే.. అవి కూడా ఆరోగ్యంగా, ఉల్లసంగా ఉంటాయి. వాటికి పెట్టే ఫుడ్ నుంచి వాక్సినేషన్ వరకూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పెట్ డాగ్ లకు కూడా పెట్టకూడని ఆహారాలు ఉన్నాయి. వాటిని పెట్టడం ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ప్రాణాల మీదకు వచ్చే ఛాన్స్ లు కూడా ఉన్నాయి. కాబట్టి మీ పెట్ డాగ్ కి మీరు పెట్టే ఆహారాల్లో ఇవి లేకుండా ఉండేలా చూసుకోండి.
అవకాడో:
అవకాడోను పెంపుడు కుక్కలకు అస్సలు పెట్టకూడదు. ఇందులో ఉంటే పెర్సిన్ అనే ఫ్యాటీ యాసిడ్.. డాగ్ కి జీర్ణ సమస్యలు కలిగిస్తుంది. అవకాడో తింటే కుక్కలకు వాంతులు, డయేరియా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి.
పచ్చి గుడ్లు:
పెట్ డాగ్ లకు పచ్చి గుడ్లను పొరపాటును కూడా పెట్టకూడదు. ఇందులో ఉండే ఇ కోలి బ్యాక్టీరియా కుక్కలు హానికరంగా మారుతుంది. దీంతో ఫుడ్ పాయిజనింగ్ అయి.. చనిపోయే ప్రమాదం ఉంది.
ఎండు ద్రాక్ష:
పెంపుడు కుక్కలకు పెట్టకూడని ఆహారంలో ద్రాక్ష, ఎండు ద్రాక్ష కూడా ఒకటి. వీటిని వాటికి అస్సలు పెట్టకూడదు. ఇవి తింటే కుక్కలలో మూత్ర పిండాల వైఫల్యానికి కారణం అవుతాయి.
విత్తనాలున్న పండ్లను పెట్టకూడదు:
యాపిల్, అరటి, పుచ్చకాయ వంటి కొన్ని రకాల పండ్లలో విత్తనాలు ఉంటాయి. ఇలా విత్తనాలున్న ఆహారాలను పెట్ డాగ్ లకు పెట్టకపోవడమే బెటర్.
కెఫీన్:
ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, టీ ఆకులు, కాఫీ గింజలు.. ఇవన్నీ కుక్కలకు ప్రాణాపాయం కలిగించే పదార్థాలు. కాబట్టి పొరపాటున కూడా వాటికి ఇవి దరి చేరకుండా ఉండేలా చూసుకోవాలి.
చాక్లెట్:
చాక్లెట్ లను కూడా కుక్కలు పెట్టకూడదు. ఇది కూడా కుక్కలకు ప్రాణాపాయం కలిగించే పదార్థమే. కుక్కలు చాక్లెట్లు తింటే వణుకు, గుండె సమస్యలు, మూర్చ వంటి సమస్యలు వస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి