Betel leaves Benefits: రుమటాయిడ్ ఆర్థరైటిస్, హైపర్‌ యూరిసెమియా వ్యాధుల్ని తగ్గించే తమలపాకులు.. ఎలా వాడాలంటే..!!

మారుతున్న కాలంతో పాటు.. మన జీవన శైలిలోనూ మార్పులొచ్చాయి. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో వచ్చిన మార్పుల కారణంగా.. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ రక్తంలో కనిపించే మురికి భాగం. వైద్య భాషలో చెప్పాలంటే దీనిని హైపర్‌ యూరిసెమియా అంటారు. హైపర్‌ యూరిసెమియా పెరగడం వల్ల శరీరంలో మార్పు వస్తుంది. కీళ్ల నొప్పులు, నరాల వాపులు రావడమే కాకుండా.. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడి ఇతర వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. యూరిక్ యాసిడ్ (హైపర్‌ యూరిసెమియా) ఎక్కువ కాలం శరీరంలో ఉంటే..

Betel leaves Benefits: రుమటాయిడ్ ఆర్థరైటిస్, హైపర్‌ యూరిసెమియా వ్యాధుల్ని తగ్గించే తమలపాకులు.. ఎలా వాడాలంటే..!!
Betel Leaves
Follow us
Chinni Enni

|

Updated on: Aug 30, 2023 | 11:44 AM

మారుతున్న కాలంతో పాటు.. మన జీవన శైలిలోనూ మార్పులొచ్చాయి. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో వచ్చిన మార్పుల కారణంగా.. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ రక్తంలో కనిపించే మురికి భాగం. వైద్య భాషలో చెప్పాలంటే దీనిని హైపర్‌ యూరిసెమియా అంటారు. హైపర్‌ యూరిసెమియా పెరగడం వల్ల శరీరంలో మార్పు వస్తుంది. కీళ్ల నొప్పులు, నరాల వాపులు రావడమే కాకుండా.. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడి ఇతర వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. యూరిక్ యాసిడ్ (హైపర్‌ యూరిసెమియా) ఎక్కువ కాలం శరీరంలో ఉంటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతాయి. అందుకే ముందుగానే యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడాన్ని గ్రహించి.. ఆదిలోనే కొన్ని నేచురల్ పద్ధతుల ద్వారా తగ్గించుకోవాలి. హైపర్‌ యూరిసెమియాను తగ్గించడంలో తమలపాకులు చాలా ఉపయోగంగా ఉంటాయి.

తపాలపాకులు: యూరిక్ యాసిడ్ (హైపర్‌ యూరిసెమియా) స్థాయిల్ని తగ్గించడంలో తమలపాకులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ ఆకులలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల అసౌకర్యం, నొప్పిని తగ్గిస్తాయి.

బోలు ఎముకల వ్యాధి: యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉంది. యూరిక్ యాసిడ్ బాధితులు ప్రతిరోజూ తమలపాకును నమిలి తినాల్సి ఉంటుంది. అందులో సున్నం, వక్క వంటివి ఏవీ కలిపి తినరాదు. తమలపాకు తినేముందు గానీ.. తిన్నతర్వాత గానీ పొగాకు (సిగరెట్) తాగరాదు.

ఇవి కూడా చదవండి

కడుపు ఆరోగ్యంగా: ప్రతి రోజూ తమలపాకు తినడం వల్ల వాటిలో ఉన్న యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటిలోని అనేక బ్యాక్టీరియాలతో పోరాడుతాయి. భోజనం చేసిన తర్వాత తమలపాకును తింటే.. కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. నోటి దుర్వాసన, పంటినొప్పి, చిగుళ్లనొప్పులు, వాపులు, నోటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

జీవక్రియ పెరుగుతుంది: ప్రేగులను రక్షించడం, అపానవాయువును నివారించడంలోనూ తమలపాకులు సహాయపడుతాయి. జీవక్రియను పెంచుతాయి. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ప్రేగులు, విటమిన్లు, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.

రుతుక్రమం సక్రమంగా: రుమటాయిడ్ ఆర్థరైటిస్, హైపర్‌ యూరిసెమియాను నియంత్రించడమే కాకుండా.. టైప్ 2 డయాబెటీస్ ను నియంత్రించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. రక్తంలో అనియంత్రిత గ్లూకోజ్ వల్ల కలిగే మంటను కూడా తగ్గిస్తుంది. రుతు క్రమం సరిగ్గా రాని స్త్రీలు కూడా ప్రతిరోజూ తమలపాకును తింటే.. ఆ సమస్య తగ్గి.. రుతుక్రమం సక్రమంగా వస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి