Side Effects of Spicy Oats: మసాలా ఓట్స్ తింటున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి!!

బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్ లో ఓట్స్ ను తీసుకుంటుంటారు. బరువు తగ్గడానికి ఇవి చాలా బెస్ట్ ఫుడ్. ఇటీవల కాలంలో ఓట్స్ తినే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇవి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.. కాబట్టి ఫ్రీ రాడికల్స్ నశిస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్రేక్ ఫాస్ కు, లంచ్ కు మధ్యలో ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషణ..

Side Effects of Spicy Oats: మసాలా ఓట్స్ తింటున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి!!
Side Effects of Spicy Oats
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 10, 2023 | 6:30 PM

బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్ లో ఓట్స్ ను తీసుకుంటుంటారు. బరువు తగ్గడానికి ఇవి చాలా బెస్ట్ ఫుడ్. ఇటీవల కాలంలో ఓట్స్ తినే వారి సంఖ్య బాగా పెరిగింది. ఇవి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.. కాబట్టి ఫ్రీ రాడికల్స్ నశిస్తాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్రేక్ ఫాస్ కు, లంచ్ కు మధ్యలో ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషణ అందుతుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నిరంతరం ఫిట్ గా ఉండాలనుకునేవారు ప్రతిరోజూ ఓట్స్ నే డైట్ లో తీసుకుంటారు. మరి బరువు తగ్గడంలో ఓట్స్ ఆరోగ్యకరమేనా ? వీటిలో మసాలా ఓట్స్ ఎంతవరకూ బరువు తగ్గడంలో సహాయపడతాయో తెలుసుకుందాం.

సోడియం ఎక్కువగా ఉంటుంది: బరువు తగ్గడానికి సాధారణ ఓట్స్ ఆరోగ్యకరమైనవే. కానీ మసాలా ఓట్స్ లో అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఉండొచ్చు. అలాగే వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. స్వీట్ ఓట్స్ లో చక్కెర, మాల్టోడెక్స్ట్రిన్ ఉంటాయి. ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్ ను పెంచుతాయి. ఫలితంగా ఇన్సులిన్ పై ప్రభావం పడుతుంది.

చక్కెర స్థాయిలు పెరుగుతాయి: మసాలా ఓట్స్ రెగ్యులర్ గా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ప్రాసెస్ చేయబడుతాయి కాబట్టి వాటిలోని పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. సాధారణ ఓట్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది: మసాలా ఓట్స్ లో ఫ్లేవర్ ను పెంచేందుకు రుచులు, కృత్రిమ రంగులు, ఉప్పు, కూరగాయల నూనె, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దారితీస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు మసాలా ఓట్స్ తినడం ఆపాలి. వాటి బదులు సాధారణ ఓట్స్ ను డైట్ లో తీసుకోవడం మంచిది.

కాగా సాధారణ ఓట్ మీల్ లో విటమిన్ B, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్ లభిస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే ఆక్సిజన్ ను శరీరం మొత్తానికి అందించడంలో తోడ్పడుతాయి. ఓట్స్ లో ఉండే బీటా-గ్లూకాన్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి