Nail Polish Side Effects: తరచూ నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే..!!

అందంగా కనిపించాలంటే కేవలం ముఖం మాత్రమే అందంగా ఉంటే సరిపోదు. అందంగా కనిపించేందుకు ముఖానికి మేకప్, హెయిర్ స్టైల్ చేసుకుంటారు. అలాగే వాళ్ల కాళ్లు, చేతులకు ఉన్న వేళ్ల గోళ్లపై నెయిల్ పాలిష్ ను కూడా వేసుకుంటారు. కాళ్లు, చేతులకు అందాన్నిచ్చే ఓ కాస్మొటిక్ ప్రొడక్ట్. వారానికోసారి నెయిల్ పెయింట్ మార్చే రోజులు పోయి.. రోజుకి లేదా రెండు రోజులకు ఒకసారి కొత్త నెయిల్ పాలిష్ ను వేసేసుకుంటున్నారు. వేసుకున్న డ్రెస్ కి మ్యాచింగ్ గా నెయిల్ పాలిష్ ఉండాల్సిందే. నెయిల్ రిమూవర్ తో రిమూవ్ చేయడం..

Nail Polish Side Effects: తరచూ నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే..!!
Nail Polish Side Effects
Follow us
Chinni Enni

|

Updated on: Aug 31, 2023 | 11:27 AM

అందంగా కనిపించాలంటే కేవలం ముఖం మాత్రమే అందంగా ఉంటే సరిపోదు. అందంగా కనిపించేందుకు ముఖానికి మేకప్, హెయిర్ స్టైల్ చేసుకుంటారు. అలాగే వాళ్ల కాళ్లు, చేతులకు ఉన్న వేళ్ల గోళ్లపై నెయిల్ పాలిష్ ను కూడా వేసుకుంటారు. కాళ్లు, చేతులకు అందాన్నిచ్చే ఓ కాస్మొటిక్ ప్రొడక్ట్. వారానికోసారి నెయిల్ పెయింట్ మార్చే రోజులు పోయి.. రోజుకి లేదా రెండు రోజులకు ఒకసారి కొత్త నెయిల్ పాలిష్ ను వేసేసుకుంటున్నారు. వేసుకున్న డ్రెస్ కి మ్యాచింగ్ గా నెయిల్ పాలిష్ ఉండాల్సిందే. నెయిల్ రిమూవర్ తో రిమూవ్ చేయడం.. పూటకో కలర్ నెయిల్ పాలిష్ వేసుకోవడం. కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే యువతులు వీటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఇక సినిమాల్లో కంటే.. సీరియల్స్ నటించే స్త్రీలు నెయిల్ పాలిష్ లను మరింత ఎక్కువగా వాడుతుంటారు. నెయిల్ ఆర్ట్స్ పేరుతో 2-3 కలర్స్ వేసుకుంటారు.

కానీ నెయిల్ పాలిష్ లను ఎక్కువగా వాడితే.. అనారోగ్యం బారిన పడతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫేమస్ డ్యూక్ అనే యూనివర్శిటీ చేసిన పరిశోధనలో నెయిల్ పాలిష్ ఎక్కువగా వాడటం వల్ల బరువు పెరుగుతారని నిర్థారణ అయింది. నెయిల్ పెయింట్ లో ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనం ఉంటుంది. ప్లాస్టిక్, ఫామ్ ఫర్నీచర్ కు మంటలు అంటుకోకుండా ఉండటానికి ఈ రసాయనాన్ని వాడుతారు. ఎక్కువ రోజులు పాలిష్ గా ఉండేందుకు నెయిల్ పెయింట్ లోనూ ఈ రసాయనాన్ని కలుపుతారు. ఇది శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా బరువు పెరుగుతారని పరిశోధకులు తేల్చారు.

మార్కెట్లో లభించే 3 వేల రకాల నెయిల్ పాలిష్ లపై జరిపిన పరిశోధనల్లో 49 శాతం నెయిల్ పాలిష్ లో ట్రైఫెనైల్ ఫాస్పేట్ ఉంటుందని తేల్చారు. ఇలాంటి నెయిల్ పాలిష్ లను వేసుకున్న 10-14 గంటల్లోగా టీపీహెచ్ పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు. డైరెక్ట్ గా గోళ్లకు కాకుండా.. ఆర్టిఫిషియల్ నెయిల్స్ కి పెట్టుకుని అతికించుకుంటే దుష్ప్రభావాలు ఉండవు. కాబట్టి.. నెయిల్ పాలిష్ ను అతిగా వాడే అమ్మాయిలూ.. ఇకనైనా వాటి వాడకాన్ని తగ్గిస్తే.. అది మీ ఆరోగ్యానికే మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి