AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peepal Tree Benefits: రావిచెట్టు బెరడుతో ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా?

నేటి జీవశైలిలో వచ్చిన మార్పులే.. మన అనారోగ్యాలకు కారణం. వాటిని తగ్గించుకునేందుకు కృత్రిమ మెడిసిన్స్ పై ఆధారపడుతున్నాం. శారీరక శ్రమ తక్కువ కారణంగా అధిక బరువు పెరిగి.. ఆ తర్వాత అనేక వ్యాధుల బారిన పడుతున్నాం. పోషకాలు సరిగ్గాలేని ఆహారం కూడా అనారోగ్యానికి ఒక కారణం. పోషకాలను అందించేందుకు రకరకాల ఆహారాలను తీసుకోవడంతో.. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అతిగా అలోపతి మందులను వాడినా..

Peepal Tree Benefits: రావిచెట్టు బెరడుతో ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా?
Peeple Tree
Chinni Enni
|

Updated on: Aug 31, 2023 | 11:41 AM

Share

నేటి జీవశైలిలో వచ్చిన మార్పులే.. మన అనారోగ్యాలకు కారణం. వాటిని తగ్గించుకునేందుకు కృత్రిమ మెడిసిన్స్ పై ఆధారపడుతున్నాం. శారీరక శ్రమ తక్కువ కారణంగా అధిక బరువు పెరిగి.. ఆ తర్వాత అనేక వ్యాధుల బారిన పడుతున్నాం. పోషకాలు సరిగ్గాలేని ఆహారం కూడా అనారోగ్యానికి ఒక కారణం. పోషకాలను అందించేందుకు రకరకాల ఆహారాలను తీసుకోవడంతో.. మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల బారిన పడుతున్నారు. అతిగా అలోపతి మందులను వాడినా.. షుగర్ వచ్చేస్తుంది. వీటిని తగ్గించడంలో రావి చెట్టు బెరడు అద్భుతంగా పనిచేస్తుందని కాన్పూర్‌ లోని UHM జిల్లా హాస్పిటల్ ఆయుర్వేదచార్య డాక్టర్ విభా వర్మ తెలిపారు.

మధుమేహ నివారణకు:

ఆయుర్వేదంలో మధుమేహాన్ని తగ్గించడంలో రావి చెట్టు బెరడు బాగా పనిచేస్తుందని తేలింది. ఈ బెరడులో యాంటీ-డయాబెటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధిస్తాయి. రావిబెరడును నీటిలో మరిగించి.. చల్లారిన తర్వాత తాగాలి. రావి బెరడును పొడి చేసి.. ఆ పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగినా షుగర్ వ్యాధి తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

రక్త పోటు తగ్గించేందుకు:

అధిక రక్త పోటును తగ్గించేందుకు కూడా రావిబెరడును ఉపయోగిస్తారు. హైపర్‌ టెన్షన్ వంటి వ్యాధులకు రావి బెరడు చక్కగా పనిచేస్తుంది. రావి బెరడును క్రమం తప్పకుండా ఉపయోగిస్తే హైబీపీ తగ్గుతుంది. ధమనుల అడ్డంకిని తగ్గించడంలో సహాయపడుతుంది.

యూరిక్ యాసిడ్ ని తగ్గేలా చేస్తుంది:

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే.. అనేక రోగాలు చుట్టుముడతాయి. యాసిడ్‌ను నియంత్రించడానికి రావి బెరడు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రావి బెరడును నీటిలో మరిగించి డికాక్షన్ తయారు చేసుకోవాలి. ఈ డికాషన్ ను ఉదయం, సాయంత్రం అరకప్పుమోతాదులో తాగితే.. యూరిక్ యాసిడ్ తగ్గుతుంది.

దగ్గు, కోరింత దగ్గును దరి చేరనివ్వదు:

దగ్గు, కోరింత దగ్గును తగ్గించడంలో రావి చెట్టు బెరడు కషాయాన్ని వాడతారు. 1 గ్లాసు నీటిలో 2 నుండి 3 బెరడులను వేసి ఉడికించాలి. ఆ నీరు కాస్త గోరువెచ్చగా ఉండగానే.. నోటిలో పోసుకుని పుక్కించాలి. ఇలా చేస్తే.. దగ్గు తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు తెలిపారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి