Dhanurasana Benefits: ఈ ఒక్క ఆసనం నెలరోజులు వేస్తే.. కొండలా ఉన్న మీ పొట్ట కొవ్వొత్తిలా కరిపోవడం ఖాయం!!

మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. సహజంగా రోగాలను తగ్గించేందుకు యోగాలో చాలా ఆసనాలున్నాయి. అధిక బరువు, నొప్పులు, ఒత్తిడి తదితరాలను తగ్గించే ఆసనాలను గురించి ప్రతిరోజూ తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు పొట్టను తగ్గించే ఆసనం గురించి తెలుసుకుందాం. ఈ ఆసనం వేయడం కష్టం అనుకుంటారు కానీ.. నిదానంగా అలవాటు చేసుకుంటే సులభమే. ఈ ఆసనం పేరు ధనురాసనం...

Dhanurasana Benefits: ఈ ఒక్క ఆసనం నెలరోజులు వేస్తే.. కొండలా ఉన్న మీ పొట్ట కొవ్వొత్తిలా కరిపోవడం ఖాయం!!
Dhanurasana Benefits
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 11, 2023 | 9:30 AM

మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. సహజంగా రోగాలను తగ్గించేందుకు యోగాలో చాలా ఆసనాలున్నాయి. అధిక బరువు, నొప్పులు, ఒత్తిడి తదితరాలను తగ్గించే ఆసనాలను గురించి ప్రతిరోజూ తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు పొట్టను తగ్గించే ఆసనం గురించి తెలుసుకుందాం. ఈ ఆసనం వేయడం కష్టం అనుకుంటారు కానీ.. నిదానంగా అలవాటు చేసుకుంటే సులభమే. ఈ ఆసనం పేరు ధనురాసనం.

ధ‌నురాస‌నం వేసే విధానం:

ఈ ఆసనాన్ని వేసేందుకు.. తొలుత నేలపై బోర్లా పడుకోవాలి. కాళ్లను వెనక్కి వంచి రెండు చేతులతో రెండు పాదాలను పట్టుకోవాలి. తల, ఛాతీ, తొడలను పైకెత్తి పొట్టపై భారం పడేలా చూడాలి. ఇలా 15-20 సెకన్లపాటు ఉండాలి. తర్వాత నెమ్మదిగా ఊపిరి వదులుతా బోర్లా స్థితికి రావాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా 10 సార్లు ధనురాసనాన్ని వేస్తే.. ఎంత కొండలా ఉన్న పొట్టైనా నెలరోజుల్లో కొవ్వొత్తిలా కరిగిపోతుంది.

ఇవి కూడా చదవండి

ధ‌నురాస‌నం వల్ల కలిగే ప్రయోజనాలు:

మనసు ప్రశాంతంగా ఉంటుంది: ఈ ఆసనం రోజూ వేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తగ్గి.. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నిద్రలేమి సమస్య నుంచి బయటపడొచ్చు.

కొవ్వు కరిగిపోతుంది: పొట్ట దగ్గరి కొవ్వు కరగడంతో పాటు.. అధిక బరువు తగ్గి.. చక్కని శరీర ఆకృతిని పొందుతారు. పొట్ట దగ్గరి కండ‌రాలు దృఢంగా ఉంటాయి. కండరాలు, ఎముకలు సాగుతాయి.

వెన్ను నొప్పి సమస్య ఉండదు: చేతులు, తొడలు గట్టి పడుతాయి. స్త్రీలలో పీసీఓడీ సమస్య తగ్గి, పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. వెన్నునొప్పి సమస్య కూడా తగ్గుతుంది. వెన్నెముక దృఢంగా ఉంటుంది.

గ్యాస్ సమస్యలు దూరం:  అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఆకలి నియంత్రణలోకి వస్తుంది. ఆకలి లేనివారికి ఆకలి పెరుగుతుంది.

లోబీపీ మాయం: కడుపు నొప్పి, అల్సర్, మైగ్రేన్, లోబీపీ వంటి సమస్యలున్నవారు ధనురాసనం వేయరాదు. వేయాలనుకుంటే యోగా నిపుణులను సంప్రదించి వేయడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి