Washing Machine: ఇంటిలో వాషింగ్ మెషీన్ ఎక్కడ పెడితే మంచిది?

ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో.. ఇంటి లోపల ఉండే వస్తువులకు, అవసరాల కోసం వాడే వస్తువుల విషయంలోనూ అంతే ఖచ్చితంగా వాస్తును పాటిస్తారు. వాస్తు గురించి బాగా తెలిసిన వారు ఈశాన్యంలో అసలు బరువు ఉంచరు. బీరువా, ఫ్రిడ్జ్ వంటి అధిక బరువు వస్తువులు కాదు కదా.. కనీసం కుర్చీ కూడా ఆ దిక్కున పెట్టరు. ఇంకా చాలా విషయాల్లో వాస్తును ఖచ్చితంగా పాటిస్తుంటారు. మొక్కలను పెట్టేందుకు కూడా వాస్తు చూసుకునేవారు ఉన్నారంటే నమ్ముతారా! కాగా ప్రస్తుతం ఇంటి..

Washing Machine: ఇంటిలో వాషింగ్ మెషీన్ ఎక్కడ పెడితే మంచిది?
Washing Machine
Follow us
Chinni Enni

|

Updated on: Aug 31, 2023 | 12:01 PM

ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమో.. ఇంటి లోపల ఉండే వస్తువులకు, అవసరాల కోసం వాడే వస్తువుల విషయంలోనూ అంతే ఖచ్చితంగా వాస్తును పాటిస్తారు. వాస్తు గురించి బాగా తెలిసిన వారు ఈశాన్యంలో అసలు బరువు ఉంచరు. బీరువా, ఫ్రిడ్జ్ వంటి అధిక బరువు వస్తువులు కాదు కదా.. కనీసం కుర్చీ కూడా ఆ దిక్కున పెట్టరు. ఇంకా చాలా విషయాల్లో వాస్తును ఖచ్చితంగా పాటిస్తుంటారు. మొక్కలను పెట్టేందుకు కూడా వాస్తు చూసుకునేవారు ఉన్నారంటే నమ్ముతారా! కాగా ప్రస్తుతం ఇంటి అవసరాల కోసం వాడే వస్తువుల్లో వాషింగ్ మెషీన్ కూడా ఒక భాగమైంది.

ప్రస్తుతం కాలంలో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్ లేని ఇళ్లులు చాలా తక్కువ. బిజీ బిజీ లైఫ్ కారణంగా మెషీన్స్ మన ఇంట్లో ఇక భాగమవుతున్నాయి.ఇక చాలా మంది వాషింగ్ మిషీన్ ని ఎక్కడ పెట్టాల అని తర్జన భర్జన పడుతూంటారు. కొందరు వీలును బట్టి దీనిని బాత్రూమ్ లో ఉంచుతారు. ఇంకొందరు బాల్కనీలో, ఇంటి వెనుక పెట్టుకుంటూ ఉంటారు. ఇంటి లోపల కంటే ఇంటి బయటే వాషింగ్ మిషీన్ పెడుతుంటారు.

బాల్కీనీలో ఉంచవచ్చా..

ఇవి కూడా చదవండి

అయితే.. వాషింగ్ మిషీన్ ను బాల్కనీలో ఉంచడం మంచిదేనా ? అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. వాషింగ్ మిషీన్ ను బాల్కనీలో ఉంచవచ్చు. దీనికోసం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. బాల్కనీలో వాషింగ్ మిషీన్ పెట్టాలంటే.. కొంచెం ఎత్తైన స్థలాన్ని ఎంచుకోవాలి. బాల్కనీలోకి వర్షపునీరు చేరినా.. అది వాషింగ్ మిషీన్ లోకి చేరకుండా ఉంటుంది. అలాగే మిషీన్ పాడవుతుందేమోనన్న టెన్షన్ కూడా ఉండదు.

వాషింగ్ మెషీన్ ను బాల్కనీలో ఉంచినట్టైతే.. దానిపై షెడ్ లాగా ఏర్పాటు చేయాలి. ఎండ, వాన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. వాషింగ్ మిషీన్ లో నీటిని తీసుకోడానికి, నీటిని బయటకు పంపడానికి రంధ్రాలుంటాయి. వాటిలోకి ఏదైనా కీటకం ప్రవేశిస్తే.. యంత్రంలో తేడా రావొచ్చు. కాబట్టి కీటకాల నుండి యంత్రాన్ని రక్షించడానికి బాల్కనీ చుట్టూ నెట్ లేదా, గ్రిల్ లాంటిది ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా వాషింగ్ మిషీన్ తడవకుండా దానిపై రెయిన్ ప్రూఫ్ షీట్ ను అమర్చాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి