Simple Healthy Tips foe You: ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!!

ప్రస్తుతం ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మనకంటూ కాస్త సమయాన్ని కూడా వెచ్చించలేకపోతున్నాం. ఫలితం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. దీంతో డాక్టర్ల వద్దకు పరుగులెత్తి.. ట్యాబ్లెట్లు మింగాల్సి వస్తుంది. అయితే రోజూ కొన్ని పద్దతలను పాటిస్తే.. వాటిన్నింటికీ దూరంగా ఉండొచ్చు.. ఆరోగ్యకరంగా జీవించవచ్చు. దీనికంటూ కాస్త సమయాన్ని పాటించాలి. మీకంటూ కాస్త సమయాన్ని కూడా వెచ్చించుకున్నట్టు అవుతుంది. అయితే అన్నీ పాటించాల్సి అవసరం లేదు..

Simple Healthy Tips foe You: ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!!
Healthy Lifestyle
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2023 | 8:30 AM

ప్రస్తుతం ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మనకంటూ కాస్త సమయాన్ని కూడా వెచ్చించలేకపోతున్నాం. ఫలితం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. దీంతో డాక్టర్ల వద్దకు పరుగులెత్తి.. ట్యాబ్లెట్లు మింగాల్సి వస్తుంది. అయితే రోజూ కొన్ని పద్దతలను పాటిస్తే.. వాటిన్నింటికీ దూరంగా ఉండొచ్చు.. ఆరోగ్యకరంగా జీవించవచ్చు. దీనికంటూ కాస్త సమయాన్ని పాటించాలి. మీకంటూ కాస్త సమయాన్ని కూడా వెచ్చించుకున్నట్టు అవుతుంది. అయితే అన్నీ పాటించాల్సి అవసరం లేదు.. మీ సమయాన్ని బట్టి.. వాటిల్లో కొన్నైనా చేస్తే సరిపోతుంది. ఉదయం 8 లోపు మీరు చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకుందాం.

తొందరగా లేచేందుకు ప్రయత్నించండి:

ఉదయం తొందరగా లేచేందుకు ప్రయత్నించండి. మీరు మీ పనులకు వెళ్లే కనీసం రెండు గంటల ముందైనా లేవడం మంచిది. లేదంటే అప్పటికప్పుడు లేస్తే మీరు ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

నీరు తాగండి:

మీరు ఉదయం లేవగానే నీరు తాగాలి. కనీసం రెండు గ్లాసుల నీళ్లైనా తాగాలి. రాత్రి పడుకునే ముందు.. లేసే సమయానికి మధ్య చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి.. డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఉదయాన్నే నీళ్లు తాగడం మంచింది.

మెడిటేషన్ (ధ్యానం):

లేచిన తర్వాత రోజూ 10 నిమిషాల మెడిటేషన్.. మెదడును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. అలాగే రోజంతా యాక్టీవ్ గా ఉండేందుకు తోడ్పడుతుంది.

వ్యాయామం:

రోజూ కనీసం ఓ అరగంట పాటైనా వ్యాయామం చేస్తే శరీరం యాక్టీవ్ గా ఉంటుంది. అలాగే రోజంతా మీరు ఫ్రెష్ గా, ఉత్సాహంగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. వ్యాయామంతో అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

ఎండ తగిలేలా చూసుకోవాలి:

ఉదయపు ఎండ బాడీకి చాలా అవసరం. కాసేపు ఎండలో ఉంటే.. శరీరానికి కావాల్సిన విటమిన్ డీ దొరుకుతుంది.

ఇంట్లోనే కాఫీ, టీ తాగండి:

మీకు మీరే ఓ కప్పు కాఫీ చేసుకుని తాగండి. బయట వాటి కంటే ఇంట్లోనే కాఫీ, టీ తాగేలా చూసుకోండి. దీంతో ఒకలాంటి అనుభూతిని పొందుతారు. ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నట్లయితే మీతో పాటే ఒక ట్రావెల్ మగ్ ని క్యారీ చేయండి.

హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినండి:

రాత్రి భోజనం తర్వాత ఉదయానికి చాలా గ్యాప్ వస్తుంది. కాబట్టి వీలైనంత వరకూ ఉదయం 8 లోపు బ్రేక్ ఫాస్ట్ ముగించేలా చూడింది. ఆ టిఫిన్ లో ప్రొటీన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్.. రోజంతా యాక్టీవ్ గా ఉండేలా చేస్తుంది.

మీ కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేయండి:

ఉదయం ఎప్పుడో పనులకు వెళ్లి మళ్లీ రాత్రి వరకూ రారు. కుటుంబ సభ్యులతోక కలిసి ఉండేది కాస్త సమయమే. కాబ్టటి మీకు ఉన్న ఆ సమయంలో కుటుంబ సభ్యులు, పిల్లలు లేదీ మీకు ఇష్టమైన వ్యక్తులతో గడపండి. లేదా మీ స్నేహితుడితో కలిసి తినేందుకు, వ్యాయామం చేసేందుకు టైమ్ ప్లాన్ చేయండి. మిమ్మల్ని నవ్వించే వ్యక్తులతో బాగా ఇంటరాక్ట్ అవ్వండి.

మీ బెడ్ ని మీరే సర్దుకోండి:

ఉదయం లేవగానే మొదటగా చేయాల్సిన పని ఏంటంటే.. మీ బెడ్ ని మీరే సర్దుకోవడం.

మీ లంచ్ బాక్స్ ని మీరే ప్యాక్ చేసుకోండి:

మంచి అలవాట్లు ముందు మనతోనే స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి మన లంచ్ బాక్స్ ని మనమే ప్యాక్ చేసుకునేందుకు ట్రై చేయాలి. మీకు నచ్చిన విధంగా మీరు లంచ్ బాక్స్ ను తయారు చేసుకుని ప్యాక్ చేసుకోవచ్చు. లంచ్ లో ఏమి ఉంటే మీకు టమ్మీ హ్యాపీగా ఉంటుందో అలాంటి వాటిని ఎంచుకోండి.

ఉదయం లేవగానే ఫోన్ అస్సలు చూడకండి:

సాధారనంగా ఇప్పుడు ఎవరైనా లేవగానే ఫోన్ చూడం అలవాటు. మెయిల్స్, టెక్స్, రీల్స్, యూట్యూబ్ ఇలా ఎవరికి నచ్చింది వారు చూస్తారు. కానీ ఇలా ఎంత మాత్రం చేయకండి. ఉదయం లేవగానే మీరు ఫోన్ చూస్తే.. మీపై మీరు దృష్టిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకూ రాత్రుళ్లు, ఉదయం ఫోన్ దూరంగా ఉంచండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి