Side Effects of Egg Rolls: యమ్మీగా ఉన్నాయని ఎగ్ రోల్స్ లాగించేస్తున్నారా? ఇది తెలిస్తే దానిని ముట్టుకోరు!!

ఎగ్ రోల్.. పేరు చెప్పగానే మీకూ నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? బయట దొరికే జంక్ ఫుడ్ లో ఈ ఎగ్ రోల్స్ ఒకటి. ఇవి టేస్టీగా యామ్మీగా ఉంటాయి. ఒక దాని తర్వాత మరొకటి వరుసగా తినేస్తారు. ఎగ్ రోల్స్ అంటే చాలా మందికి ఇష్టం. రెండు, మూరు రోజులకు ఓ సారైనా ఇది తినాల్సిందే. సింగిల్ ఎగ్ రోల్, డబుల్ ఎగ్ రోల్స్ ను లాగించేస్తారు. కానీ ఎగ్ రోల్ ను తినడం వల్ల అది ఆరోగ్యంపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందో తెలుసా..

Side Effects of Egg Rolls: యమ్మీగా ఉన్నాయని ఎగ్ రోల్స్ లాగించేస్తున్నారా? ఇది తెలిస్తే దానిని ముట్టుకోరు!!
Egg Rolls
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2023 | 8:00 AM

ఎగ్ రోల్.. పేరు చెప్పగానే మీకూ నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? బయట దొరికే జంక్ ఫుడ్ లో ఈ ఎగ్ రోల్స్ ఒకటి. ఇవి టేస్టీగా యామ్మీగా ఉంటాయి. ఒక దాని తర్వాత మరొకటి వరుసగా తినేస్తారు. ఎగ్ రోల్స్ అంటే చాలా మందికి ఇష్టం. రెండు, మూరు రోజులకు ఓ సారైనా ఇది తినాల్సిందే. సింగిల్ ఎగ్ రోల్, డబుల్ ఎగ్ రోల్స్ ను లాగించేస్తారు. కానీ ఎగ్ రోల్ ను తినడం వల్ల అది ఆరోగ్యంపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందో తెలుసా? మరి ఆ నష్టాలేంటో తెలుసుకోండి.

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది: ఎగ్ రోల్ ను తయారు చేసేందుకు ఎక్కువగా నూనెను వాడుతుంటారు. ఇది అనారోగ్య సమస్యకు ప్రధాన కారణం. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నాయి.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని పెంచుతుంది: ఎగ్ రోల్స్ లో ఉండే సంతృప్త కొవ్వు.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఫలితంగా గుండె సమస్యలు పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

రక్త పోటుకు గురవుతారు: ఎగ్ రోల్స్ లో ఉప్పు ఎక్కువగా వాడుతారు. అలాగే అందులో కలిపే సాస్ లో సోడియం ఉంటుంది. క్రమం తప్పకుండా మీరు ఎగ్ రోల్స్ తింటున్నట్లైతే త్వరగా రక్తపోటు పెరుగుతుంది. హైబీపీ ఉన్నవారు ఎగ్ రోల్ తినకూడదు. ఇది రక్తపోటును మరింత పెంచుతుంది.

షుగర్ పేషెంట్స్ దూరంగా ఉండటమే బెటర్: గుడ్డులో చక్కెరను పెంచే కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ పేషంట్స్ కూడా ఎగ్ రోల్ తినకపోవడమే మంచిది.

బరువు పెరుగుతారు: ఎగ్ రోల్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి డైట్ తీసుకునేవారు, అధిక బరువు ఉన్నవారు ఎగ్ రోల్స్ ను తినకూడదు.

గుండెకు అంత మంచిది కాదు: వీటి తయారీకి వాడే ఆయిల్ గుండె అంత మంచిది కాదు. త్వరగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి.. ఎగ్ రోల్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి