Shower: వ్యాయామం చేసిన తర్వాత స్నానం చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!!
ప్రస్తుతం ఇప్పుడందరూ పూర్తిగా ఫిట్ నెస్ పై ఫోకస్ చేస్తున్నారు. ఎంత నాజుగ్గా ఉంటే.. అంత మంచిదని ఫీల్ అవుతున్నారు. దీంతో పలు రకాల వ్యాయామలు, వాకింగ్ లు, జాగింగ్ లు ఇలా చాలానే చేస్తున్నారు. చమటలు కక్కేంతగా ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్నారు. వ్యాయామం తర్వాత వెంటనే స్నానం చేసి రిలాక్స్ అవుతారు. జిమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత బాత్ చేస్తే బాడీ పెయిన్స్ తో పాటు ఫ్రెష్ గా కూడా ఉంటుంది. ఆ నెక్ట్స్ ఇక షరా మామూలే. ఉరుకులు పరుగుల మీద..
ప్రస్తుతం ఇప్పుడందరూ పూర్తిగా ఫిట్ నెస్ పై ఫోకస్ చేస్తున్నారు. ఎంత నాజుగ్గా ఉంటే.. అంత మంచిదని ఫీల్ అవుతున్నారు. దీంతో పలు రకాల వ్యాయామలు, వాకింగ్ లు, జాగింగ్ లు ఇలా చాలానే చేస్తున్నారు. చమటలు కక్కేంతగా ఫిట్ నెస్ కోసం కష్టపడుతున్నారు. వ్యాయామం తర్వాత వెంటనే స్నానం చేసి రిలాక్స్ అవుతారు. జిమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత బాత్ చేస్తే బాడీ పెయిన్స్ తో పాటు ఫ్రెష్ గా కూడా ఉంటుంది. ఆ నెక్ట్స్ ఇక షరా మామూలే. ఉరుకులు పరుగుల మీద ఆఫీసులకు వెళ్తారు. మరి వర్కౌట్స్ తర్వాత స్నానం చేస్తే ఎలాంటి ప్రయోజాలు ఉన్నాయి? అలానే ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరు వెచ్చటి నీటితో స్నానం బెటర్:
వ్యాయామాలు లేదా వర్కౌట్స్ తర్వాత గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే రీ ఫ్రెష్ గా, మనసు తేలిక పడినట్టు ఉంటుంది. ఇలా చేయడం కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వర్కౌట్స్ ఇంట్లో చేసినా, బయట చేసినా నొప్పులు మాత్రం కామన్. అలాగే కండరాల్లో మార్పులు కూడా వస్తాయి. ఇవి మళ్లీ సాధారణ స్థితికి రావాలంటే రెస్ట్ అవసరం. దీంతో బాత్ చేయడం వల్ల కండరాలు అన్నీ రెస్ట్ గా ఫీల్ అవుతాయి. ఇలా చేయడం వల్ల బాడీ పెయిన్స్ తగ్గుతాయి. శరీరం త్వరగా రికవరీ అవుతుంది. రక్త ప్రసణ మెరుగు పడుతుంది. కండ రాలకు అవసరమైన ఆక్సిజన్ లభిస్తుంది. వేడి నీటితో స్నానం చేస్తే బీపీ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.
వేడి నీటితో ప్రయోజనాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి అవేంటంటే:
వేడి నీటితో స్నానం చేస్తే వాపులు పెరిగే ఛాన్స్ లేకపోలేదు. అలాగే బాడీ డీహైడ్రేట్ కి గురవుతుంది. శరీరంలో మంట తగ్గదు. గుండె జబ్బులు ఉన్న వారికి వేడి నీటి స్నానం అస్సలు మంచిది కాదు. కాబట్టి ఏ నీటితో స్నానం చేయాలనేది వైద్యుల సలహా తీసుకోవాలి. లేదంటే మీరు కష్టపడినదంతా వృధా అవ్వక తప్పదు
ఐస్ బాత్:
ఐస్ బాత్ గురించి చాలా మందికి తెలుసు. వర్కౌట్స్ తర్వాత ఐస్ బాత్ చేయడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల నొప్పులు తగ్గడమే కాదు.. శరీరంలో వచ్చే మంటలను కూడా ఐస్ బాత్ తో పోతాయి. వ్యాయామాల్లో ఏవైనా చిన్న చిన్న గాయాలు అయినా.. వాటిని నుంచి ఐస్ బాత్ రిలాక్సేషన్ ఇస్తుంది. ఇది చేయాలంటే ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం బెటర్.
చెమట దూరం:
వ్యాయామం చేసిన తర్వాత చాలా మందికి చెమటలు పడతాయి. దీంతో దురద, దద్దర్లు వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి. వీటిని దూరం చేయాలంటే స్నానం బెస్ట్. బాత్ చేస్తే మానసికంగా, శారీరకంగా మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి