Periods: మీకు పీరియడ్స్ తొందరగా రావాలా.. అయితే ఈ ఫుడ్స్ ని తినండి!!
పీరియడ్స్ రావడానికి.. రాకపోవడానికి అనేక సమస్యలు ఉంటాయి. కొంత మందికి నెలసరి ఇర్రెగ్యులర్ గా వస్తుంది. మరికొంత మందికి కేవలం 15 లేదా 20 రోజుల్లో వస్తాయి. అలా త్వరగా వచ్చిన సమస్యనే.. లేట్ గా వచ్చిన ప్రాబ్లమే. ఆడవారి నెలసరి సమయం సరిగ్గా ఉంటేనే వారు ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుతం చాలా మంది మహిళలకు పీరియడ్స్ సమయానికి రాక ఎన్నో సమ్యలను ఎదుర్కొంటున్నారు. శరీరలోని హార్మోన్ల మార్పుల వల్ల , ఒత్తిడి, ఆందోళన, బరువు పెరగడం, మారిన లైఫ్ స్టైల్ విధానం వల్ల కూడా నెలసరి రావడం లేదు. అయితే మీకు పీరియడ్స్ త్వరగా రావాలన్నా.. క్రమం తప్పకుండా టైమ్ కి..
పీరియడ్స్ రావడానికి.. రాకపోవడానికి అనేక సమస్యలు ఉంటాయి. కొంత మందికి నెలసరి ఇర్రెగ్యులర్ గా వస్తుంది. మరికొంత మందికి కేవలం 15 లేదా 20 రోజుల్లో వస్తాయి. అలా త్వరగా వచ్చిన సమస్యనే.. లేట్ గా వచ్చిన ప్రాబ్లమే. ఆడవారి నెలసరి సమయం సరిగ్గా ఉంటేనే వారు ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుతం చాలా మంది మహిళలకు పీరియడ్స్ సమయానికి రాక ఎన్నో సమ్యలను ఎదుర్కొంటున్నారు. శరీరలోని హార్మోన్ల మార్పుల వల్ల , ఒత్తిడి, ఆందోళన, బరువు పెరగడం, మారిన లైఫ్ స్టైల్ విధానం వల్ల కూడా నెలసరి రావడం లేదు. అయితే మీకు పీరియడ్స్ త్వరగా రావాలన్నా.. క్రమం తప్పకుండా టైమ్ కి రావాలన్నా కొన్ని రకాలైన ఆహార పదార్థాలను మీ డైట్ లో యాడ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా.
విటమిన్ సి:
మీకు పీరియడ్స్ టైమ్ కి రాక ఇబ్బంది పడుతుంటే.. విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది. విటమిన్ సి ఉన్న కాయగూరలు, పండ్లు, ఫుడ్స్ తింటే నెలసరి సరిగ్గా వస్తుంది. కివీ, నిమ్మకా, నారింజ, బత్తాయి ఇలాంటివి తీసుకుంటే బెటర్. అలాగే ఇవి శరీరంలోని రక్త ప్రసరణను కూడా మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా పీరియడ్స్ సమయంలో వచ్చే నీరసం, అలసటను కూడా విటమిన్ సి తగ్గిస్తుంది.
పైనాపిల్:
పైనాపిల్ ని అనాస పండు అని కూడా అంటారు. నెలసరి రాక ఇబ్బంది పడుతున్న వారు.. త్వరగా రావాలనుకునే వారికి పైనాపిల్ బెస్ట్ ఆప్షన్. ఇందులో ఉండే విటమిన్ సి ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. బాగా పండిన పైనాపిల్ తింటే బెటర్. అలాగే నెలసరి సమయంలో రక్త స్రావం సక్రమంగా అవ్వటానికి కూడా పైనాపిల్ హెల్ప్ చేస్తుంది.
నువ్వులు:
నెలసరి రాక.. త్వరగా రావాలనుకునే వారికి మరో మంచి ఆప్షన్ ఐరన్ పుష్కలంగా ఉన్న నువ్వులు. ఈ టిప్ ని పురాతన కాలం నుంచి పెద్దలు ఉపయోగిస్తూనే ఉ న్నారు. నువ్వులు – బెల్లం కలిపి తింటే మీకు పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. అలాగే పీరియడ్స్ లో వచ్చే నిరసాన్ని కూడా ఇది దూరం చేస్తుంది.
బొప్పాయి పండు:
బొప్పాయిలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఇది పీరియడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తుంది. ఇది ఈస్ట్రోజెన్ స్థాయి పెంచుతుంది. దీంతో నెలసరి టైమ్ కి రావడానికి సహాయపడుతుంది. మీకు పీరియడ్స్ త్వరగా రావాలంటే.. బొప్పాయి జ్యూస్, పండిన బొప్పాయి, బొప్పాయి కూర వంటిని వాటిని తినొచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి