High Calcium Foods: మీరు పాలు తాగరా.. అయితే ఈ ఫుడ్స్ ని తినండి!!
ఎముకలు దృఢంగా ఉంటేనే ఏ పని అయినా చేయగలం. ఉదయం లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకు మనం చేసే పని అంతా ఎముకల మీదనే ఆధార పడి ఉంటుంది. అలాంటి ఎముకలు బలంగా ఉండాలంటే దానికి కావాల్సింది కాల్షియం. కేవలం ఎముకలకే కాదు.. కండరాల సంకోచం, దంతాలు, రక్తం గడ్డకట్టడం, నరాల పని తీరులో కాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండటానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా కాల్షియం సహాయ పడుతుంది. మేయో క్లినిక్ ప్రకారం.. శరీరంలో కాల్షియం లోపిస్తే.. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాల్షియం అధికంగా..
ఎముకలు దృఢంగా ఉంటేనే ఏ పని అయినా చేయగలం. ఉదయం లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకు మనం చేసే పని అంతా ఎముకల మీదనే ఆధార పడి ఉంటుంది. అలాంటి ఎముకలు బలంగా ఉండాలంటే దానికి కావాల్సింది కాల్షియం. కేవలం ఎముకలకే కాదు.. కండరాల సంకోచం, దంతాలు, రక్తం గడ్డకట్టడం, నరాల పని తీరులో కాల్షియం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇవే కాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండటానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా కాల్షియం సహాయ పడుతుంది. మేయో క్లినిక్ ప్రకారం.. శరీరంలో కాల్షియం లోపిస్తే.. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాల్షియం అధికంగా ఉన్న ఆహార పదార్థాల్లో పాలు ఒకటి. కానీ చాలా మందికి పాలు తాడం ఇష్టముండదు. ఇలాంటి వాళ్లు మరి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం:
సుమారు 23 బాదం పప్పుల్లో.. 75 మిల్లీ గ్రాముల కాల్షియం నిండి ఉంటుంది. బాదంలో కాపర్, మాంగనీస్, మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఖనిజాలు, మెగ్నీషియం, ఓమేగా-3, 6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అలాగే వీటిల్లో ఫైబర్ తో పాటు ప్రొటీన్ కూడా అధికంగా ఉంటుంది. నాన బెట్టిన బాదం, బాదం పాలు తీసుకుంటే కాల్షియం సమృద్ధిగా దొరకుతుంది.
ఆకు కూరలు:
ఆకు కూరల్లో కూడా కాల్షియం మెండుగా ఉంటుంది. అందులోనూ పాల కూర, కాలే ఆకు కూరల్లో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఒక కప్పు ఉడికించిన పాల కూరలో 250 మిల్లీ గ్రాముల కాల్షియం, అలాగే ఒక కప్పు ఉడికించిన కాలేలో 180 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. పాలు తాగని వారు వీటిని సలాడ్స్, జ్యూస్ లు, స్మూతీలు, కూరల్లో వేసుకుని తింటే కాల్షియం లోపానికి చెక్ పెట్టవచ్చు.
అంజీర్:
అంజీర్ లలో కూడా కాల్షియం మెండుగానే ఉంటుంది. ఒక కప్పు అంజీర్ పండ్లలో 162 మిల్లీ గ్రాముల కాల్షియం లభ్యమవుతుంది. అంజీర్ లో కాల్షియమే కాదు.. మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ కూడా లభిస్తాయి. తరచూ వీటిని తింటే చాలా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
చియా సీడ్స్:
చియా సీడ్స్ లలో కూడా కాల్షియం అధికంగానే లభిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లలో 177 మిల్లీ గ్రాముల కాల్షియం దొరుకుతుంది. వీటిలో ప్రోటీన్, ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మెండుగా ఉంటాయి. చియా సీడ్స్ ను కూడా నేరుగా తినడం ఇష్టపడని వారు జ్యూస్ లు, స్మూతీలు, సలాడ్స్ లో యాడ్ చేసుకోవచ్చు.
టోఫూ:
టోఫూలో అత్యధికంగా కాల్షియం ఉంటుంది. అరకప్పు టోఫూలో ఏకంగా 861 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. దీన్ని కూరల్లో, జ్యూస్ లలో, సలాడ్స్ లలో ఎలాగైనా తీసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి