Cholesterol Reducing Foods: ఈ సింపుల్ జ్యూస్ లు ట్రై చేయండి.. కొలెస్ట్రాల్ ఈజీగా కరిగించండి!!

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది గుండె పోటులతో మరణిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. ముఖ్యంగా యువత ఈ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. మనతో మాట్లాడుతూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. దీనికి ముఖ్య కారణం మన ఆహారపు, జీవన అలవాట్లే. జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నవారు, గంటలు గంటలు కూర్చొని పని చేసేవారు, సమయానికి తినలేని వారు, వ్యాయామం చేయకపోవడం వంటి పనులు రక్త నాళాల్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తున్నాయి. ఇది కాస్తా రక్త సరఫరాకు అడ్డంకులుగా ఏర్పడి హార్ట్ స్ట్రోక్ కి దారి తీస్తున్నాయి. మరి ఈ కొలెస్ట్రాల్ ని అదుపులో..

Cholesterol Reducing Foods: ఈ సింపుల్ జ్యూస్ లు ట్రై చేయండి.. కొలెస్ట్రాల్ ఈజీగా కరిగించండి!!
Bad Cholesterol
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 03, 2023 | 3:01 PM

Rప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది గుండె పోటులతో మరణిస్తున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. ముఖ్యంగా యువత ఈ హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోతున్నారు. మనతో మాట్లాడుతూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. దీనికి ముఖ్య కారణం మన ఆహారపు, జీవన అలవాట్లే. జంక్ ఫుడ్ ఎక్కువగా తిన్నవారు, గంటలు గంటలు కూర్చొని పని చేసేవారు, సమయానికి తినలేని వారు, వ్యాయామం చేయకపోవడం వంటి పనులు రక్త నాళాల్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ పేరుకుపోయేలా చేస్తున్నాయి. ఇది కాస్తా రక్త సరఫరాకు అడ్డంకులుగా ఏర్పడి హార్ట్ స్ట్రోక్ కి దారి తీస్తున్నాయి. మరి ఈ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచేందుకు ఇప్పటికే ఎన్నో రకాల టిప్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈజీగా కొన్ని రకాల పండ్లు, కూరగాయాల జ్యూస్ లు చేసుకుని తాగితే కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిల్లో ఏదో ఒకటి తాగినా.. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకొని, ఆరోగ్యంగా ఉండొచ్చు.

దానిమ్మ జ్యూస్:

దానిమ్మ జ్యూస్.. కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకునేందుకు చాలా హెల్ప్ చేస్తుంది. దానిమ్మ కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు రక్త నాళాల్లో ఉన్న అడ్డంకులను తొలిగిస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. అంతేకాకుండా దానిమ్మ జ్యూస్ తాగితే రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. ఎప్పుడైనా జంక్ ఫుడ్ ని అధికంగా తీసుకున్నప్పుడు.. ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తీసుకుంటే.. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తుంది.

ఇవి కూడా చదవండి

నారింజ పండ్ల జ్యూస్:

నారింజ పండ్ల జ్యూస్ లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు సహాయ పడుతుంది. నారింజ పండ్ల జ్యూస్ తాగినా కూడా కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవచ్చు. గుండెకు కూడా చాలా మంచి చేస్తుంది. అలాగే ఇందులో ఉండే సీ విటమిన్ కారణంగా చర్మ, జుట్టు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే ఫ్రెష్ గా, యాక్టీవ్ గా ఉంటాం.

టమాటా జ్యూస్:

టమాటాలో కూడా చెడు కొలెస్ట్రాల్ ను అదుపులోకి తీసుకొచ్చేందుకు బాగా సహాయ పడుతుంది. ఇందులో ఉండే లైకోపిన్.. లిపిడ్ల స్థాయిలను పెంచుతుంది. టమాటా జ్యూస్ గుండె పని తీరును కూడా మెరుగు పరుస్తుంది. రోజూ టమాటా జ్యూస్ తాగితే.. గుండె ఆరోగ్యమే కాకుండా స్కిన్ కూడా గ్లోగా, షైనీగా ఉంటుంది. అలాగే జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..
అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..