Alcohol: మద్యం తాగిన తర్వాత ఈ ఆహారాలను తింటున్నారా.. చాలా డేంజర్!!
మద్యం.. ఈ మాట ఎత్తితే మందు బాబులకు నోరు జిమ్మని లాగుతుంది. మద్యం తాగే అలవాటు ఉన్నవారికి.. రోజుకు ఓ చుక్కైనా పడనిదే ముద్ద దిగదు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.. మనోళ్లు పట్టించుకోరు. పైగా గవర్నమెంటుకు ఆదాయం మా వాళ్లనే అంటూ సెటైర్లు వేస్తారు. మరికొంత మంది మద్యం తాగడం ఫ్యాషన్ గా భావిస్తారు. ఈ రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. రాత్రుళ్లు, పగలు అనే తేడా లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రోజంతా బార్ షాపుల వద్ద మందు బాబులు బారులు తీరుతున్నారు. యువత కూడా మద్యానికి బాగా అలవాటు..
మద్యం.. ఈ మాట ఎత్తితే మందు బాబులకు నోరు జిమ్మని లాగుతుంది. మద్యం తాగే అలవాటు ఉన్నవారికి.. రోజుకు ఓ చుక్కైనా పడనిదే ముద్ద దిగదు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.. మనోళ్లు పట్టించుకోరు. పైగా గవర్నమెంటుకు ఆదాయం మా వాళ్లనే అంటూ సెటైర్లు వేస్తారు. మరికొంత మంది మద్యం తాగడం ఫ్యాషన్ గా భావిస్తారు. ఈ రోజుల్లో మద్యం తాగేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. రాత్రుళ్లు, పగలు అనే తేడా లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రోజంతా బార్ షాపుల వద్ద మందు బాబులు బారులు తీరుతున్నారు. యువత కూడా మద్యానికి బాగా అలవాటు పడిపోయారు. వారికి తగ్గట్టే మార్కెట్లో రకరకాల మద్యం బ్రాండ్స్ వస్తున్నాయి. అయితే మద్యం సేవించిన తర్వాత చాలా మంది వారికి తెలీకుండా కొన్ని రకాల ఫుడ్స్ ని తింటూంటారు.
బార్, పబ్, హోటల్, బ్యాచిలర్ పార్టీ, హౌస్ పార్టీలలో ఆల్కహాల్ తో పాటు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా వడ్డిస్తారు. అయితే ఆల్కహాల్ సేవించిన తర్వాత కూడా తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయట. వాటిని తింటే అనారోగ్యానికి అడ్రస్ ఇచ్చి ఆహ్వానం పలికినట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు తాగకూడదు:
ఆల్కాహాల్ తాగిన తర్వాత పాలు అస్సలు తాగకూడదు. మద్యం సేవించిన తర్వాత ఇలా చేస్తే బాడీలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి, ఊబకాయానికి దారితీస్తుంది. అలాగే డ్రింక్ చేసేటప్పుడు వేరుశెనగ లేదా జీడిపప్పు తింటే ఆరోగ్యానికి హానికరం.
చికెన్ తినకూడదు:
ఆల్కహాల్ సేవించే సమయంలో కానీ లేదా చికెన్, క్రిస్పీ చిప్స్, వేయించిన మోమోస్ తినకూడదు. తింటే కడుపులో లేని పోని తేడాలొస్తాయి. తర్వాత డాక్టర్ దగ్గరకెళ్లి వేలకు వేలు వదిలించుకోవాల్సి వస్తుంది.
స్వీట్లు – చాక్లెట్లు తినకూడదు:
మద్యం సేవించిన తర్వాత స్వీట్లు, చాక్లెట్లు తినకూడదు. డ్రింక్ తాగిన తర్వాత స్వీట్లు తినడం అంటే.. విషాన్ని తినట్టేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మద్యం తాగేటపుడు ఈ ఆహారాలను అస్సలు తినకండి.
శీతల పానీయాల జోలికి వెళ్లకూడదు:
సాధారణంగా చాలా మంది మందు తాగేటప్పుడు సోడా లేదా శీతల పానీయాల్లో కలుపుకుని తాగుతారు. వీటిలో గ్యాస్ అధికంగా ఉంటుంది. వాటికి బదులుగా కూల్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ లో మద్యం కలిపి తాగొచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి