Ghee Benefits: నెయ్యితో ముఖ సౌందర్యాన్ని పెంచుకోండి ఇలా.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!!

ముఖం అందంగా కనిపించాలని రకరకాల క్రీమ్ లు వాడుతుంటారు. ముఖ్యంగా ఆడవారు మేకప్ లు, ఐ లైనర్లు, లిప్ స్టిక్ లు, ఐ బ్రో షేప్స్.. ఒక్కటేంటి.. మార్కెట్ లోని రకరకాల ప్రొడక్ట్స్ ముఖంపై వాడుతారు. అయితే వాటిల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో కొన్నాళ్లకు ముఖంపై గుంటలు ఏర్పడుతాయి. ఇలా ముఖానికి హాని చేసేవి కాకుండా.. ఇంట్లోనే నేచురల్ గా మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అందుకు నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. మరి నెయ్యిని ముఖానికి ఎలా..

Ghee Benefits: నెయ్యితో ముఖ సౌందర్యాన్ని పెంచుకోండి ఇలా.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!!
Ghee
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 03, 2023 | 3:12 PM

ముఖం అందంగా కనిపించాలని రకరకాల క్రీమ్ లు వాడుతుంటారు. ముఖ్యంగా ఆడవారు మేకప్ లు, ఐ లైనర్లు, లిప్ స్టిక్ లు, ఐ బ్రో షేప్స్.. ఒక్కటేంటి.. మార్కెట్ లోని రకరకాల ప్రొడక్ట్స్ ముఖంపై వాడుతారు. అయితే వాటిల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో కొన్నాళ్లకు ముఖంపై గుంటలు ఏర్పడుతాయి. ఇలా ముఖానికి హాని చేసేవి కాకుండా.. ఇంట్లోనే నేచురల్ గా మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అందుకు నెయ్యి చాలా ఉపయోగపడుతుంది. మరి నెయ్యిని ముఖానికి ఎలా ఉపయోగించుకోవచ్చు.. ఎలా ఉపయోగిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో.. తెలుసుకుందాం.

మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది:

ముఖానికి మాయిశ్చరైజర్ గా నెయ్యిని వాడవచ్చు. కరిగించిన నెయ్యి 3 స్పూన్లు ఒక గిన్నెలో వేసుకుని అందులో అదే క్వాంటిటీలో అలోవెరా జెల్ ను కలిపి పేస్ట్ లా చేయాలి. మాయిశ్చరైజర్ రెడీ అవుతుంది. రాత్రి పడుకునే ముందు దీనిని మీ ముఖానికి రాస్తే చాలు. రాత్రంతా అలాగే వదిలేసి ఉదయాన్నే కడిగేయాలి. లేదా 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుకోవాలి.

ఇవి కూడా చదవండి

నెయ్యితో హ్యాండ్ క్రీమ్ తో తయారు చేసుకోవచ్చు:

నెయ్యితో ఇంట్లోనే మేలైన హ్యాండ్ క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. 2-3 చెంచాల కరిగించిన నెయ్యి తీసుకుని అందులో 2-3 చెంచాల కొబ్బరి నూనెను కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ క్రీమ్ సిద్ధంగా ఉంటుంది. కొబ్బరి నూనెకు బదులుగా బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు. మీ చేతులు పొడిబారినట్లు అనిపించినప్పుడల్లా చేతులకు ఈ క్రీమ్ ను అప్లై చేసి.. మసాజ్ చేసుకోవచ్చు.

బాడీ స్క్రబ్ కోసం నెయ్యి:

బాడీ స్క్రబ్ కోసం కూడా నెయ్యిని వాడవచ్చు. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు, 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ శనగపిండిని తీసుకుని వాటన్నింటినీ బాగా కలిపి స్క్రబ్ ను సిద్ధం చేసుకోవాలి. ఈ స్క్రబ్ ను చర్మంపై అప్లై చేసి, రౌండ్ గా కొన్నిసార్లు స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత మామూలుగా స్నానం చేస్తే చాలు. మీ స్కిన్ పై మృతకణాలు పోతాయి.

ఫేస్ ప్యాక్ గా నెయ్యి:

2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి చిటికెడు పసుపు వేసి మరోసారి కలపాలి. ఇలా రెడీ చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. సాధారణ నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. కొద్దిరోజుల్లోనే మీ ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

పెదాలకు రక్షణగా నెయ్యి:

పగిలిన పెదాలను మృదువుగా, గులాబీ రంగులో మార్చేందుకు కూడా నెయ్యిని వాడవచ్చు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు 2-3 చుక్కల నెయ్యిని పెదాలపై రాసి.. వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే రెండు రోజుల్లో పగిలిన పెదవులు మృదువుగా మారుతాయి. తర్వాత నల్లగా ఉన్న పెదాలు గులాబీ రంగులోకి మారుతూ వస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి