Rajma Curry: ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న రాజ్మా కర్రీ.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి!!

రాజ్మాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రాజ్మాను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని స్నాక్ గా, కర్రీగా కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని చపాతీల్లోకి కూడా చేసుకోవచ్చు. రాజ్మాలో పోషకాలు, ఖనిజాలు, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. ఇంకా మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, పాస్పరస్, ఫైబర్, ఐరన్, సోడియం, కాల్షియం, కాపర్ వంటివి అధికంగా లభ్యమవుతాయి. రాజ్మా చాలా రంగుల్లో లభ్యమవుతాయి. ముదురు ఎరుపు, లేత ఎరుపు, నలుపు ఇలా అనేక రంగుల్లో..

Rajma Curry: ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న రాజ్మా కర్రీ.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి!!
Rajma Benefits
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 03, 2023 | 3:10 PM

రాజ్మాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. రాజ్మాను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని స్నాక్ గా, కర్రీగా కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని చపాతీల్లోకి కూడా చేసుకోవచ్చు. రాజ్మాలో పోషకాలు, ఖనిజాలు, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. ఇంకా మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, పాస్పరస్, ఫైబర్, ఐరన్, సోడియం, కాల్షియం, కాపర్ వంటివి అధికంగా లభ్యమవుతాయి. రాజ్మా చాలా రంగుల్లో లభ్యమవుతాయి. ముదురు ఎరుపు, లేత ఎరుపు, నలుపు ఇలా అనేక రంగుల్లో లభిస్తాయి. చిన్న పిల్లలకు ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇన్ని పోషక విలువలున్న రాజ్మాతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని అన్నంలోకి కానీ, వెజ్ పులావ్ లోకి కానీ, పూరీ, చపాతీలతో తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేయడం కూడా చాలా ఈజీ.

రాజ్మా కర్రీకి తయారీకి కావాల్సిన పదార్థాలు:

రాజ్మా – అరకప్పు (వీటికి ఉడికించి పెట్టుకోవాలి), నూనె – తగినంత, ఉప్పు, కారం – మీ రుచికి సరిపడినంత, టమాటాలు – 2, గరం మసాలా – పావు టీ స్పూన్, కొత్తిమీర, కరివేపాకు – కొద్దిగా నెయ్యి – రెండు టేబుల్ స్పూన్స్, ఎండు మిర్చి – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, జీల కర్ర – అర టీస్పూన్, లవంగాలు – 4, యాలకులు – 2, రెండు, బిర్యానీ ఆకు – 1 చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్, పసుపు – కొద్దిగా

ఇవి కూడా చదవండి

రాజ్మా కర్రీ తయారీ విధానం:

ఒక కళాయి తీసుకుని నూనె వేడి చేశాక ఉల్లి పాయ పేస్ట్, పచ్చి మిర్చి ముక్కలు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత టమాటాలను ప్యూరీ లాగా చేసి.. దాన్ని వేసుకోవాలి. ఇది కూడా నూనె పైకి తేలేంత వరకూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత.. ఉప్పు వేసి ఉడికించి పెట్టుకున్న రాజ్మాను నీటితో సహా వేసుకుని కలపాలి. నెక్ట్స్ మూత పెట్టి పది నిమిషాల పాటు కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ. ఈ రాజ్మా కర్రీ.. రుచితో పాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి