Lemon Rasam: నిమ్మకాయతో ఇలా రసాన్ని పెట్టండి.. అంతే గిన్నె ఖాళీ అయిపోతుంది!!

నిమ్మకాయలో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కటని చెప్పలేం కానీ.. సరిగ్గా వాడితే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అధిక బరువు తగ్గడానికి, దగ్గు, జలుబు, కఫం, చర్మం, జుట్టు సమస్యల కోసం, రోగ నిరోధక శక్తి, రక్త హీనత సమస్యలు, గుండె - కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు, మూత్ర పిండాల కోసం ఇలా చాలా రకాల అనారోగ్య సమస్యలను నిమ్మకాయ దూరం చేస్తుంది. నిమ్మ కాయను..

Lemon Rasam: నిమ్మకాయతో ఇలా రసాన్ని పెట్టండి.. అంతే గిన్నె ఖాళీ అయిపోతుంది!!
Lemon Rasam
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 03, 2023 | 3:06 PM

నిమ్మకాయలో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కటని చెప్పలేం కానీ.. సరిగ్గా వాడితే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అధిక బరువు తగ్గడానికి, దగ్గు, జలుబు, కఫం, చర్మం, జుట్టు సమస్యల కోసం, రోగ నిరోధక శక్తి, రక్త హీనత సమస్యలు, గుండె – కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు, మూత్ర పిండాల కోసం ఇలా చాలా రకాల అనారోగ్య సమస్యలను నిమ్మకాయ దూరం చేస్తుంది. నిమ్మ కాయను వంటల్లో వాడటం వల్ల ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా.. రుచిగా కూడా ఉంటాయి. నిమ్మకాయను వాడటం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ నిమ్మకాయతో ‘నిమ్మకాయ రసం’ కూడా తయారు చేసుకోవచ్చు.

నిమ్మకాయ రసం ప్రయోజనాలు:

ఈ రసాన్ని వాతావరణం మారుతున్నప్పుడు చేసుకుంటూ ఉంటే.. సీజనల్ వ్యాధులను దూరం పెట్టుకోవచ్చు. జ్వరంగా ఉన్నప్పుడు, నోటికి రుచిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ రసాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది చేయడం కూడా చాలా సులభం. జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు.. వేడి వేడిగా ఈ రసంతో భోజనం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ రసానికి కావాల్సిన పదార్థాలు:

నిమ్మకాయ రసం – ఒక పెద్ద టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 4, టమాట – 1, కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా, బాగా మెత్తగా ఉడికించిన కంది పప్పు – పావు కప్పు, ఉప్పు – సరిపడినంత, బెల్లం – చిన్న ముక్క, పసుపు – పావు టీ స్పూన్, అల్లం – చిన్న ముక్క, మిరియాలు – అర టీ స్పూన్, ఇంగువ – కొద్దిగా, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక పెద్ద టేబుల్ స్పూన్,

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తి మీర, కంది పప్పు పేస్ట్, ఉప్పు, బెల్లం, పసుపు వేసి కలిపి.. స్టవ్ మీద పెట్టాలి. ఇది కాసేపు మరిగాక పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు అల్లం, మిరియాలను కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి నూనె వెయ్యాలి. వేడెక్కాక.. మిరియాలు – అల్లం పేస్ట్, ఇంగువ వేసి వేయించాలి. ఆ తర్వాత ఈ రసానికి తాళింపు పెట్టాలి. నెక్ట్స్ రసం గిన్నెను మరలా స్టవ్ మీద ఉంచి మరో మూడు నిమిషాల పాటు మరిగించి పక్కన పెట్టుకొని, అందులో నిమ్మకాయ రసాన్ని వేసి కలపాలి. అంతో ఎంతో రుచిగా, కమ్మగా ఉండే నిమ్మకాయ రసం రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి