Kitchen Hacks: వెండి వస్తువులు నల్లగా అవుతున్నాయా? వీటితో క్లీన్ చేస్తే మెరిసిపోతాయ్!!

ఇప్పుడు దాదాపుగా వెండి వస్తువులు అందరి ఇళ్లలోనూ ఉంటున్నాయి. దేవుడికి పూజ చేసేటపుడు వెలిగించే దీపపు కుందులు, దేవుడి విగ్రహం, దేవుడికి పూజచేసే వెండి పువ్వులు, వెండి ప్లేట్లు, వెండి గంధం, కుంకుమ గిన్నెలు ఇలా చాలానే ఉంటాయి. ఇక ఇంట్లో ఆడపిల్లలు, అమ్మలు అయితే కాళ్లకు వెండి పట్టీలు ధరిస్తారు. మగవారు వెండి చైన్లు, వెండి బ్రేస్ లెట్స్ పెట్టుకుంటారు. వెండి వస్తువులు, వెండి ఆభరణాలు నిరంతరం ఉపయోగించడం వల్ల వాటికి కిలుము పట్టి.. మెరుపు తగ్గిపోతుంది. వెండి వస్తువులకు తిరిగి మెరుపు రావాలంటే.. షాపులో మెరుగు పెట్టిస్తారు. తరచూ మెరుగు పెట్టించడం వల్ల..

Kitchen Hacks: వెండి వస్తువులు నల్లగా అవుతున్నాయా? వీటితో క్లీన్ చేస్తే మెరిసిపోతాయ్!!
Silver Pooja Items
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 03, 2023 | 3:13 PM

ఇప్పుడు దాదాపుగా వెండి వస్తువులు అందరి ఇళ్లలోనూ ఉంటున్నాయి. దేవుడికి పూజ చేసేటపుడు వెలిగించే దీపపు కుందులు, దేవుడి విగ్రహం, దేవుడికి పూజచేసే వెండి పువ్వులు, వెండి ప్లేట్లు, వెండి గంధం, కుంకుమ గిన్నెలు ఇలా చాలానే ఉంటాయి. ఇక ఇంట్లో ఆడపిల్లలు, అమ్మలు అయితే కాళ్లకు వెండి పట్టీలు ధరిస్తారు. మగవారు వెండి చైన్లు, వెండి బ్రేస్ లెట్స్ పెట్టుకుంటారు. వెండి వస్తువులు, వెండి ఆభరణాలు నిరంతరం ఉపయోగించడం వల్ల వాటికి కిలుము పట్టి.. మెరుపు తగ్గిపోతుంది. వెండి వస్తువులకు తిరిగి మెరుపు రావాలంటే.. షాపులో మెరుగు పెట్టిస్తారు. తరచూ మెరుగు పెట్టించడం వల్ల వెండి త్వరగా అరిగిపోతుంది. అలా కాకుండా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే వెండి వస్తువులను తళ తళమని మెరిసేలా చేసుకోవచ్చు. దీని వల్ల వెండిని పాలిష్ చేసేందుకు ఖర్చు చేసే డబ్బు కూడా ఆదా అవుతుంది. మరి ఆ టిప్స్ ఏంటి? ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందామా.

టూత్ పేట్స్ తో క్లీన్ చేసుకోవచ్చు:

వెండి వస్తువులను టూత్ పేస్ట్ తో శుభ్రం చేయవచ్చు. వెండి సామాన్లపై టూత్ పేస్ట్ రాసి ఓ 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత బ్రష్ తో స్క్రబ్ చేయాలి. 5 నిమిషాల పాటు ఇలా బ్రష్ తో రుద్ది.. తర్వాత నీటితో శుభ్రంగా కడిగితే.. వెండిపై పేరుకున్న కిలుము పోతుంది. వెంటి వస్తువులు క్లీన్ గా తెల్లగా మెరుస్తాయి.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా – వైట్ వెనిగర్:

వెండి సామాన్లైనా, ఇత్తడి సామాన్లైనా తళతళ మెరుస్తూ ఉండాలంటే.. బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ తో క్లీన్ చేయాలి. ఈ రెండింటినీ కలిపి ఒక మెత్తని క్లాత్ పై వేసి వెండిపై రబ్ చేయాలి. తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే వెండి వస్తువులు మునుపటిలా మెరుస్తూ.. షైనీగా ఉంటాయి.

నిమ్మరసంతో వెండి వస్తులు తళతళ:

నిమ్మరసం ఎలాంటి మురికినైనా తొలగించడంలో బాగా పని చేస్తుంది. వెండి వస్తువులు మెరిసేలా చేసేందుకు నిమ్మరసాన్ని బేకింగ్ సోడాలో కలిపి.. వాటిపై రుద్దాలి. ఇలా క్లీన్ చేస్తే వెండి వస్తువులు కొత్తవాటిలా మెరుస్తాయి.

డిష్ సబ్బు:

వెండి వస్తువులు, ఆభరణాలపై పేరుకున్న నలుపును పోగొట్టేందుకు షాంపూ లేదా ఏదైనా డిష్ సబ్బును వాడవచ్చు. 2 స్పూన్ల డిష్ సోప్, లిక్విడ్ తీసుకు 1 కప్పు వెచ్చని నీటిలో కలపాలి. అందులో వెండి వస్తువులను వేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి.. ఆ తర్వాత క్లీన్ చేయాలి. దీంతో వెండి వస్తువులకు ఉన్న మురికి పోతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
2 వేల నోట్లు మళ్లీ మార్చుకునే ఛాన్సుంటుందా.? ఆర్బీఐ ప్రకటన..
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా.?
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షోలో ఎమోషనల్‌. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య,బాలకృష్ణ
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!
అమెరికా ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన యువకుడిపై ట్రోలింగ్.!