Lemon Peel Benefits: తొక్కే కదా అని పారేయకండి.. నిమ్మకాయ తొక్కలతో బోలెడు ప్రయోజనాలు!!
నిమ్మకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. దాని వల్లే మనకు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. దగ్గు, జబులు, జ్వరం, గొంతునొప్పి వంటివి ఉంటే తగ్గుతాయి. నాన్ వెజ్ కర్రీలు మంటగా ఉంటే.. వాటిలో నిమ్మరసం వేసుకుని తింటారు. ఎక్కువగా చికెన్ లో నిమ్మకాయ కలుపుకుని తింటుంటారు. ఎందుకంటే చికెన్ వేడి, నిమ్మరసం చలువ చేస్తుంది. నిమ్మకాయల్లో కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. నిమ్మకాయల రసమే కాదు. నిమ్మతొక్కలతోనే..
నిమ్మకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. దాని వల్లే మనకు ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. దగ్గు, జబులు, జ్వరం, గొంతునొప్పి వంటివి ఉంటే తగ్గుతాయి. నాన్ వెజ్ కర్రీలు మంటగా ఉంటే.. వాటిలో నిమ్మరసం వేసుకుని తింటారు. ఎక్కువగా చికెన్ లో నిమ్మకాయ కలుపుకుని తింటుంటారు. ఎందుకంటే చికెన్ వేడి, నిమ్మరసం చలువ చేస్తుంది. నిమ్మకాయల్లో కాల్షియం, పొటాషియం కూడా ఉంటాయి. నిమ్మకాయల రసమే కాదు. నిమ్మతొక్కలతోనే ప్రయోజనాలున్నాయి. జుట్టు, చర్మానికి నిమ్మ తొక్కలను వాడొచ్చు.
నిమ్మ తొక్కల్ని ఇలా తీసుకోండి:
విటమిన్ సి కోసం కొందరు టాబ్లెట్స్ వాడుతుంటారు. వాటికి బదులుగా నిమ్మ తొక్కల్ని ఎండబెట్టి, పొడిచేసి గాలి చేరని సీసాలో దాచుకుని.. కూరలు, స్మూతీలు, రోటి పచ్చళ్లు, సలాడ్స్, జ్యూస్ లలో వేసుకుంటే సి విటమిన్ కొరత తగ్గుతుంది. నోటిలో చిగుళ్లు కూడా దెబ్బతినకుండా ఉంటాయి.
నిమ్మ తొక్కలను చర్మంపై రుద్దండి:
నిమ్మ తొక్కలతో చర్మంపై రుద్దితే చాలా వరకూ మురికి పోతుంది. చర్మం నిగనిగలాడుతుంది. కాస్మోటిక్స్, సబ్బుల తయారీలో నిమ్మతొక్కల్ని వాడుతారు.
రక్త పోటు నియంత్రణలో ఉంటుంది:
శరీరంలో చెడు కొలస్ట్రాల్ ను కరిగించడంలో నిమ్మ తొక్కలు బాగా ఉపయోగపడుతాయి. నిమ్మ తొక్కల్లోని పాలీఫెనాల్ ఫ్లేవనాయిడ్స్ బాగా పనిచేస్తాయి. నిమ్మతొక్కల పొడిని వాడితే కొలెస్ట్రాల్ తగ్గి.. బరువు తగ్గుతారు. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. రక్తపోటు కూడా తగ్గుతుంది.
ఎముకలను బలంగా ఉంచుతుంది:
నిమ్మతొక్కల పొడి.. ఎముకలను కూడా బలంగా ఉంచుతుంది. చర్మంపై ఉండే గడ్డలు, కాయలు వంటి వాటిని తొలగించడంలో నిమ్మతొక్కల పొడి బాగా పనిచేస్తుంది.
వాంతులు అవ్వవు:
నిమ్మతొక్కల వాసన పీల్చితే.. మనసులో ఆందోళన, టెన్షన్లు తగ్గుతాయి. నిరాశ, నిస్పృహలలో ఉండేవారు నిమ్మతొక్కల వాసన చూడాలి. ప్రయాణాల సమయంలో వాంతులయ్యే వారు కూడా వీటి వాసన చూస్తే వాంతులు అవ్వవు.
క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది:
తరచూ నిమ్మతొక్కల పొడిని ఆహారంలో తీసుకుంటూ ఉంటే.. లిమోనిన్, సాల్వెస్ట్రాల్ క్యూ40 వంటి పోషకాలు.. క్యాన్సర్ కణాలతో పోరాడి.. ప్రాణాంతక వ్యాధిని అరికడతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి