AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Side Effects of Face Wash: ఫేస్ వాష్ చేసుకునేటపుడు ఈ మిస్టేక్స్ చేయకండి.. లేదంటే చర్మ సమస్యలు వస్తాయ్!!

స్నానం చేసినపుడు మాత్రమే కాకుండా.. మిగతా సమయాల్లోనూ ముఖాన్ని సోప్ లేదా ఫేస్ వాష్ తో కడుక్కోవడం రోజువారీ దిన చర్యలో ఒక భాగం. కొందరు కేవలం బయటకు వెళ్లినప్పుడు మాత్రమే ఫేస్ వాష్ లను వాడుతారు. మరికొందరు ఇంట్లో కూడా ఫేస్ వాష్ లను యూజ్ చేస్తారు. కొందరు చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక పద్ధతుల్ని కూడా అనుసరిస్తారు. అయితే కొందరికి ముఖం సరిగ్గా కడుక్కున్నా చర్మం గరుకుగా, పొడి బారడం వంటి ఇబ్బందులుంటాయి. ముఖంపై పేరుకున్న జిడ్డు పూర్తిగా..

Side Effects of Face Wash: ఫేస్ వాష్ చేసుకునేటపుడు ఈ మిస్టేక్స్ చేయకండి.. లేదంటే చర్మ సమస్యలు వస్తాయ్!!
Face Wash Cleaning
Chinni Enni
|

Updated on: Sep 01, 2023 | 4:51 PM

Share

స్నానం చేసినపుడు మాత్రమే కాకుండా.. మిగతా సమయాల్లోనూ ముఖాన్ని సోప్ లేదా ఫేస్ వాష్ తో కడుక్కోవడం రోజువారీ దిన చర్యలో ఒక భాగం. కొందరు కేవలం బయటకు వెళ్లినప్పుడు మాత్రమే ఫేస్ వాష్ లను వాడుతారు. మరికొందరు ఇంట్లో కూడా ఫేస్ వాష్ లను యూజ్ చేస్తారు. కొందరు చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక పద్ధతుల్ని కూడా అనుసరిస్తారు. అయితే కొందరికి ముఖం సరిగ్గా కడుక్కున్నా చర్మం గరుకుగా, పొడి బారడం వంటి ఇబ్బందులుంటాయి. ముఖంపై పేరుకున్న జిడ్డు పూర్తిగా పోకపోతే మొటిమలు కూడా వస్తుంటాయి. మరి ముఖాన్ని ఎలా కడుక్కోవాలి? ముఖం కడిగే సమయంలో చేయకూడని మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీకు సూట్ అయ్యే ఫేస్ వాష్ ని వాడండి:

ఏ ఫేస్ వాష్ క్రీమ్స్ పడితే వాటిని వాడుకోకూడదు. ఫేస్ వాష్ ఎక్కువగా వాడటం వల్ల చర్మం పొడి బారడం, మొటిమలు రావడం వంటి చర్మ సమస్యలు వస్తుంటాయి. మీ స్కిన్ రకాన్ని బట్టి.. దానికి సూట్ అయ్యే సరైన ఫేస్ వాష్ ను ఉపయోగించాలి. లేకపోతే సరైన స్కిన్ స్పెషలిస్ట్ లను కలవాలి.

ఇవి కూడా చదవండి

ఈ టైంలో ఫేస్ వాష్ క్రీమ్ అస్సలు వాడకూడదు:

వేసవిలోనే కాదు సాధారణంగా కూడా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ట్యాంక్ లో ఉండే నీరు చాలా వేడిగా ఉంటుంది. ఇలాంటి నీటితో ముఖం కడుక్కునేటపుడు ఫేస్ వాష్ ను వాడకూడదు. ఈ రెండింటి కలయిక వల్ల నేచురల్ ఆయిల్ తగ్గి.. చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఎలర్జీస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఫేస్ వాష్ నే వాడాలనుకుంటే చల్లటి నీటినే వాడాల్సి ఉంటుంది.

వైప్స్ ని వాడకూడదు:

చాలా మంది అధిక వేడి వాతావరణం ఉన్నపుడు ముఖాన్ని శుభ్రం చేసుకునేందుకు వైట్ వైప్ లను వాడుతుంటారు. కానీ వీటితో చర్మం పూర్తిగా శుభ్రం అవ్వదు. పైగా వైప్స్ పూర్తిగా రసాయనాలతో తయారయ్యేవే ఉంటాయి. వీటి వాడకం వల్ల చర్మంపై ఉన్న రంధ్రాలు మూసుకుపోయి.. స్కిన్ బ్రేక్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి వైప్స్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది.

శుభ్రంగా ఉన్న క్లాత్ తోనే తుడుచుకోవాలి:

చర్మ సంరక్షణ కోసం ముఖాన్ని పదేపదే శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. క్లీన్ గా ఉన్న క్లాత్ తో తుడవడం అంతే ముఖ్యం. మురికిగా ఉన్న క్లాత్ తో తుడిస్తే.. అది మరో చర్మ సమస్యకు కారణం అయ్యే అవకాశాలున్నాయి. దానిపై ఉండే బ్యాక్టీరియా చర్మానికి బదిలీ అయి.. చర్మసంబంధిత సమస్యలు రావొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..