AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palm Fruit: తాటిపండు తింటున్నారా? ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్యౌషధం..

తాటికాయ తెలియని వారుండరు. ఐతే తాటికాయలు ఏడాది పొడవునా అందుబాటులో ఉండవు. ఒక్క వేసవి కాలంలోనే చల్లని తాటి ముంజలు నోరూరిస్తాయి. తాటి కాయ కాస్త ముదిరితే పండి కమ్మని సువాసన వస్తుంది. ఐతే చాలా మందికి పండిన తాటికాయ కూడా తింటారనే విషయం తెలియదు. ముఖ్యంగా పండిన తాటి కాయ తింటో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయంటున్నారు..

Palm Fruit: తాటిపండు తింటున్నారా? ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్యౌషధం..
Palm Fruit Benefits
Srilakshmi C
|

Updated on: Sep 01, 2023 | 4:14 PM

Share

తాటికాయ తెలియని వారుండరు. ఐతే తాటికాయలు ఏడాది పొడవునా అందుబాటులో ఉండవు. ఒక్క వేసవి కాలంలోనే చల్లని తాటి ముంజలు నోరూరిస్తాయి. తాటి కాయ కాస్త ముదిరితే పండి కమ్మని సువాసన వస్తుంది. ఐతే చాలా మందికి పండిన తాటికాయ కూడా తింటారనే విషయం తెలియదు. ముఖ్యంగా పండిన తాటి కాయ తింటో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పండిన తాటి కాయలు శ్రావణ-భాద్రపద మాసంలో లభిస్తాయి. పండిన తాటికాయతో వివిధ రకాల వంటకాలు తయారు చేయవచ్చు. ముఖ్యంగా బెల్లం, మిఠాయి, తాడి మొదలైనవి దీనితో తయారు చేస్తారు. ఐతే వీటిని మితంగా తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఎందుకంటే పండిన తాటికాయతో తయారు చేసిన ఆహారాలు మరీ ఎక్కువగా తింటే జీర్ణ సంబంధిత సమస్య తలెత్తుతుంది. పండు తాటికాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

తాటి పండు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

  • తాటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని పోషకాలు క్యాన్సర్‌ను నిరోధకంగా పనిచేస్తాయి.
  • మంచి జ్ఞాపకశక్తిని మెయింటెన్ చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది.
  • మలబద్ధకం, ప్రేగు సంబంధిత వ్యాధులను నయం చేయడంలో తాటి పండు మంచి పాత్ర పోషిస్తుంది.
  • తాటి పండులో ఉండే విటమిన్ బి వివిధ వ్యాధులను నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
  • వీటిల్లో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉండటం వల్ల దంతాలు, ఎముకలు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది.
  • తాటి పండు వికారం తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతుంటే తాటి పండు తినడం వల్ల చక్కని ఉపశమనం పొందవచ్చు. తాటి పండులో విటమిన్ ఎ, బి, సి, జింక్, పొటాషియం, ఐరన్, కాల్షియం వంటి అనేక ఇతర ఖనిజాలు ఉన్నాయి.
  • పండు తాటి కాయలో విటమిన్లు ఎ, సి, బి, కాపర్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఫైబర్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. తాటిపండు అలాగే తినవచ్చు లేదా గుజ్జు వేరుచేసి వివిధ వంటకాలు తయారు చేసుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.