Wontedly Vomiting: బ్రష్ నోట్లో పెట్టుకుని పసరును కక్కుతున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే!!

చాలా మంది ఉదయం బ్రష్ చేసేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేస్తారు. మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు నోట్లో బ్రష్ లు కానీ, వేళ్లు కానీ పెట్టుకుని పసరును, కఫాన్ని కక్కుతూ ఉంటారు. మరి కొంత మంది పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పసరును బయటకు లాగుతూంటారు. ఇలా కక్కితే కానీ వారికి రోజూ బ్రష్ చేసిన ఫీలింగ్ కలగదు. దీన్ని తరచూ ఒక పనిలా భావిస్తారు. ఇప్పుడే కాదు.. పూర్వ కాలంలో ప్రతి రోజూ పెద్దలు ఇలానే చేసేవారు. అయితే ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం..

Wontedly Vomiting: బ్రష్ నోట్లో పెట్టుకుని పసరును కక్కుతున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే!!
Mouth Washing
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 03, 2023 | 3:03 PM

చాలా మంది ఉదయం బ్రష్ చేసేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేస్తారు. మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు నోట్లో బ్రష్ లు కానీ, వేళ్లు కానీ పెట్టుకుని పసరును, కఫాన్ని కక్కుతూ ఉంటారు. మరి కొంత మంది పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పసరును బయటకు లాగుతూంటారు. ఇలా కక్కితే కానీ వారికి రోజూ బ్రష్ చేసిన ఫీలింగ్ కలగదు. దీన్ని తరచూ ఒక పనిలా భావిస్తారు. ఇప్పుడే కాదు.. పూర్వ కాలంలో ప్రతి రోజూ పెద్దలు ఇలానే చేసేవారు. అయితే ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఇలా నోట్లో బ్రష్ లేదా వేలు పెట్టుకుని పసరును, కఫాన్ని కక్కడం మంచిది కాదంటున్నారు.

ప్రేగుల్లో హెర్నియా వచ్చే ప్రమాదం:

ఇలా తరుచూ బలవంతంగా పసరును బయటకు లాగడం వల్ల ప్రేగులు, పొట్ట, డయాఫ్రామ్ ముడుచుకు పోయి దగ్గరగా అయ్యి, వాటిపై ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుందట.పెదీంతో కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. అలాగే బలవంతంగా కక్కడం వల్ల గొంతులో ఉండే రక్త నాళాలు చిట్లే అవకాశం ఉంది. ఇలా రోజూ చేస్తే ప్రేగుల్లో హెర్నియా వచ్చే డేంజర్ ఉందని చెప్తున్నారు. పసరు దానంతట అదే రావాలని కానీ.. ఇలా బలవంతంగా కక్కకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని వాళ్లు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇబ్బందిగా ఉంటే ఇలా చేయండి:

వికారంగా ఉన్పప్పుడు, ఆహారం జీర్ణం కానప్పుడు, వాంతి చేసుకోవాలి అనిపించినప్పుడు మాత్రమే కక్కుకోవాలి కానీ తరచూ బలవంతంగా చేయకూడదని చెబుతున్నారు. ఒకవేళ మీరు కఫాన్ని, పసరును లాగాలనుకుంటే.. వేపు పుళ్లతో నోటిని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయి.. కఫం, పసరు బయటకు వస్తాయి. అలాగే కఫంతో ఇబ్బంది పడేవారు గోరు వెచ్చటి నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కఫం తగ్గించడంలో తేనె బాగా పని చేస్తుంది. దానితో హోమ్ టిప్స్ పాటించడి కఫాన్ని తగ్గించుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి