Hair Growth Tips: జుట్టు తెల్లగా అయిందా.. ఈ పొడి వాడితే నల్లగా, ఒత్తుగా నిగనిగలాడుతుంది!!

ప్రస్తుతం మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా.. శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హార్మోన్ల ఇంబేలెన్స్, అధిక బరువు, జుట్టు సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది వరకు పెద్ద వారికే తల పండిపోయేది. కానీ ఇప్పుడు బాల్యంలోనే జుట్టు నెరిసిపోతుంది. దీంతో చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురిలో తిరగలేక ఆత్మనూన్యతా..

Hair Growth Tips: జుట్టు తెల్లగా అయిందా.. ఈ పొడి వాడితే నల్లగా, ఒత్తుగా నిగనిగలాడుతుంది!!
Hair Tips
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 03, 2023 | 5:56 PM

ప్రస్తుతం మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా.. శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హార్మోన్ల ఇంబేలెన్స్, అధిక బరువు, జుట్టు సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇది వరకు పెద్ద వారికే తల పండిపోయేది. కానీ ఇప్పుడు బాల్యంలోనే జుట్టు నెరిసిపోతుంది. దీంతో చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురిలో తిరగలేక ఆత్మనూన్యతా భావం పెరిగి.. ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నారు. ఈ జుట్టు సమస్యల నుంచి బయట పడి.. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, నల్లగా పెరగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు.

అయినా ఎలాంటి ఫలితం లేని వాళ్లకు.. ఇంట్లోనే ఈజీగా సహజ పద్దతిలో.. పేస్ట్ ను తయారు చేసుకుని వాడటం వల్ల.. చాలా సులభంగా జుట్టు సమస్యల నుంచి బయట పడొచ్చు. ఈ చిట్కాను వారానికి ఒకసారి వాడితే చాలు.. జుట్టు రాలడం తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా, పొడుగ్గా తయారవుతుంది. మరి ఆ చిట్కా ఏంటి? ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

ఇవి కూడా చదవండి

బృంగరాజ్ పౌడర్ – రెండు స్పూన్లు, ఉసిరికాయ పొడి – రెండు స్పూన్లు, పెరుగు – నాలుగు స్పూన్లు.

హెయిర్ ప్యాక్ తయారీ విధానం:

ఒక గిన్నెలో మూడు టీ స్పూన్ల బృంగరాజ్ పౌడర్ (గుంటగలగరాకు పొడి)ని తీసుకోవాలి. ఆ తర్వాత రెండు స్పూన్ ఉసిరికాయ పొడి, నాలుగు టీ స్పూన్ల పెరుగు వేసి, పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర వరకు బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడుగ్గా తయారవుతుంది. దాదాపుగా జుట్టుకు సంబంధించిన సమస్యలన్నీ పోతాయి. వీటిలో ఉండే ప్రతీ పదార్థం కూడా జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. ఈ పేస్ట్ ను తయారు చేసుకుని వారానికి ఒక్కసారైనా వాడటం వల్ల జుట్టు నల్లగా, పొడుగ్గా, కాంతి వంతంగా తయారవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి