AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salt Side Effects: అసలింతకీ ఆహారంలో రోజుకి ఎంత ఉప్పు తీసుకోవాలి..? సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే..

ప్రతి వంటకంలో ఉప్పు తప్పనిసరి. ఆహారానికి రుచిని అందించడంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ అధిక ఉప్పు వినియోగం శరీరంలో తీవ్రమైన ఆరోగ్య పరిణామాలను కారణం అవుతుంది. అధిక సోడియం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు హెచ్చరించింది కూడా. అసలింతకీ రోజుకు ఎన్ని గ్రాముల ఉప్పు తీసుకోవాలనే విషయం ప్రతి..

Salt Side Effects: అసలింతకీ ఆహారంలో రోజుకి ఎంత ఉప్పు తీసుకోవాలి..? సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే..
Salt Side Effects
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 03, 2023 | 7:52 PM

ప్రతి వంటకంలో ఉప్పు తప్పనిసరి. ఆహారానికి రుచిని అందించడంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ అధిక ఉప్పు వినియోగం శరీరంలో తీవ్రమైన ఆరోగ్య పరిణామాలను కారణం అవుతుంది. అధిక సోడియం తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు హెచ్చరించింది కూడా. అసలింతకీ రోజుకు ఎన్ని గ్రాముల ఉప్పు తీసుకోవాలనే విషయం ప్రతి ఒక్కరికీ పెద్ద చిక్కు ప్రశ్నే. పెద్దలు రోజుకు ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తినడం వల్ల రక్తపోటు తగ్గుతుందని, హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, కరోనరీ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఆహారంలో తక్కువ ఉప్పు తినే వారికి గుండె జబ్బుల ప్రమాదం 18 శాతం తక్కువని UKలో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా ఉప్పు అధికంగా తింటే గుండెలోని కర్ణిక క్రమరహిత పనితీరును కనబరుస్తుందట. ఫలితంగా హృదయ లయతప్పుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తల తిరగడం, ఊపిరి ఆడకపోవడం, అలసట వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. ఈ విధమైన సమస్య ఉన్న వారిలో ఐదు రెట్లు ఎక్కువ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

రోజువారీ ఆహారంలో ఉప్పు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే.. తక్కువ సోడియం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. అధిక ఉప్పు వినియోగం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఉప్పు తీసుకోవడం తగ్గించడం గుండె ఆరోగ్యానికి మంచిది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఉప్పు తీసుకోవడం తగ్గించడం వల్ల బరువు తగ్గవచ్చు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు వస్తాయి. ఎముక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల శరీర కణజాలాలలో పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఇది శరీరం కాల్షియంను విసర్జించేలా చేస్తుంది. ఫలితంగా ఎముక క్షీణత, బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.