AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Symptoms Of Liver: మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ చెకప్‌కు వెళ్లండి.. లేదంటే తీరని నష్టం..

మన శరీరంలో కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం. శరీరంలోని విష పదార్థాలను విచ్ఛిన్నం చేయడం, పిత్తాన్ని ఉత్పత్తి చేయడం వంటి వివిధ విధులను కాలేయం నిర్వహిస్తుంది. ఇటీవల కాలంలో అనేక మంది కాలేయ సంబంధిత వ్యాధుల భారీన పడుతున్నారు. నిజానికి కాలేయం దెబ్బతినడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఐతే శరీరంపై కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా..

Symptoms Of Liver: మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ చెకప్‌కు వెళ్లండి.. లేదంటే తీరని నష్టం..
Symptoms Of Liver Issues
Srilakshmi C
|

Updated on: Sep 02, 2023 | 12:19 PM

Share

మన శరీరంలో కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం. శరీరంలోని విష పదార్థాలను విచ్ఛిన్నం చేయడం, పిత్తాన్ని ఉత్పత్తి చేయడం వంటి వివిధ విధులను కాలేయం నిర్వహిస్తుంది. ఇటీవల కాలంలో అనేక మంది కాలేయ సంబంధిత వ్యాధుల భారీన పడుతున్నారు. నిజానికి కాలేయం దెబ్బతినడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఐతే శరీరంపై కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా కాలేయ వ్యాధిని ప్రారంభంలోనే సులువుగా గుర్తించవచ్చు. కాలేయ వ్యాధి లక్షణాలు పాదాలలో కూడా కనిపిస్తాయి. కాలేయం దెబ్బతిన్నప్పుడు పాదాలలో ఈ సంకేతాలు కనిపిస్తాయి..

వాపు

పాదాలు, చీలమండలలో వాపు కనిపిస్తుంది. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, సిర్రోసిస్, ఫ్యాటీ లివర్ డిసీజ్ మొదలైన కాలేయ సంబంధిత వ్యాధులకు సంకేతమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మీకు హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి ఉన్నట్లయితే మీకు కాలేయ క్యాన్సర్ ప్రమాదం అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధులు తరచుగా సిర్రోసిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాలేయ వ్యాధి సిర్రోసిస్‌గా మారితే కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మీ పాదాలలో వాపు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి.

పాదం అడుగున దురద

హెపటైటిస్ ఉన్న కొంతమంది రోగుల్లో అరి చేతులు, అరి కాళ్లు దురద ఉంటుంది. చేతులు, కాళ్ళ చర్మం పొడిగా మారుతుంది. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే చేతులు, పాదాలకు మాయిశ్చరైజర్ ఉపయోగించడం మంచిది.

ఇవి కూడా చదవండి

పాదాలలో నొప్పి

కాలేయ వ్యాధి కారణంగా పాదాల నొప్పి సంభవిస్తుంది. కాలేయం సరిగ్గా పని చేయకపోతే ఎడెమాలో ద్రవం శరీరంలో చేరడం ప్రారంభమవుతుంది. కాళ్ళ నరాలె దెబ్బతినడం వల్ల కాళ్ళలో తిమ్మిరి, బలహీనత, నొప్పి కనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉన్నవారికి దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో సంబంధంఉంటుంది. కాలేయ వ్యాధికి హెపటైటిస్ ముఖ్య కారణం. కాలేయంలో సమస్య ఉంటే కాలు దిగువన నొప్పి, వాపు ఉంటుంది.

పాదాల తిమ్మిరి

హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ లేదా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ కారణంగా కాలేయ సమస్యలున్న వ్యక్తుల కాళ్లలో తిమ్మిరి సంభవిస్తుంది. ఈ రెండు సమస్యలు డయాబెటిక్ పేషెంట్లలో కూడా కనిపిస్తాయి. కాలేయ సమస్యలు ఉన్నవారిలో ఇది చాలా సాధారణం.

ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ కాలేయ వ్యాధి అంటే ఏమిటి?

ఆల్కహాల్ ఎక్కువగా తాగినప్పుడు ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వస్తుంది. కొవ్వు పదార్ధాలను ఎక్కువగా తిన్నప్పుడు నాన్-ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ (NALD) సంభవిస్తుంది. దీని వలన కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. సాధారణంగా కాలేయ వ్యాధి ఉన్నవారికి అలసట, బలహీనత, అనారోగ్యం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, అరచేతులపై ఎర్రటి మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!