AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 4 Answer Key 2023: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఆన్సర్ ‘కీ’ విడుదల.. నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదలైంది. జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,878 పరీక్ష కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్సర్ కీని డౌన్ లోడ్..

TSPSC Group 4 Answer Key 2023: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఆన్సర్ ‘కీ’ విడుదల.. నేటి నుంచి అభ్యంతరాల స్వీకరణ
TSPSC Group 4 Answer Key
Srilakshmi C
|

Updated on: Aug 30, 2023 | 3:06 PM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 30: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదలైంది. జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,878 పరీక్ష కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు పేపర్లకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు కమిషన్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్సర్ కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్ధుల ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ కాపీలు, క్వశ్చన్ పేపర్లు వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ తెలిపింది.

కాగా దాదాపు 8,180 గ్రూప్‌-4 సర్వీసుల భర్తీకి జులై 1వ తేదీన రెండు పేపర్లకు ఆన్ లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించారు. పేపర్‌-1 పరీక్షకు 7,63,835 మంది హాజరుకాగా.. పేపర్‌-2 పరీక్షకు 7,61,028 మంది అభ్యర్థులు హాజరైనట్లు కమిషన్ తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ కాపీలను సెప్టెంబరు 27 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఆగ‌స్టు 30 నుంచి సెప్టెంబరు 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు లేవనెత్తాలని స్పష్టం చేసింది. అభ్యంతరాలను ఆన్ లైన్ విధానంలోనే నమోదు చేయాలని కమిషన్‌ కార్యదర్శి అనితారామచంద్రన్‌ వెల్లడించారు. గడువు తేదీ ముగిసిన తర్వాత, లేదంటే ఈ-మెయిల్‌ లేది ఇతర మార్గాల్లో వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబోమన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో ఎస్ఎస్‌సీ టైర్‌ 2 పరీక్షలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) ఎగ్జామ్‌-2023 నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్యలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. తొలుత నోటిఫికేసన్ లో మొత్తం 7,500 పోస్టులు ప్రకటించిన సంగతి తెలసిందే. తాజాగా అదనంగా 940 పోస్టులు కలిపింది. దీంతో పోస్టుల సంఖ్యను 8,440కు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది. నియామక ప్రక్రియలో భాగంగా ఆన్ లైన్ విధానంలో నిర్వహించిన టైర్‌-1 పరీక్షలు జులైలో నిర్వహించిన విషయం తెలిసిందే. టైర్ 2 పరీక్షలు అక్టోబర్‌ 25, 26, 27 తేదీల్లో జరుగనున్నాయి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా