Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patna Floating Stone: గంగానదిలో తేలుతున్న మిస్టీరియస్ రాయి.. రామసేతు శిలంటూ పూజలు చేస్తోన్న ప్రజలు

గంగానదిలో దొరికిన ఓ రాయి ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. నదిలో తేలియాడుతూ కనిపించిన ఈ రాయి రామసేతుకి సంబంధించినదని భావించిన స్థానికులు దానికి పూజలు చేయడం ప్రారంభించారు. పైగా ఆ రాయిపై 'శ్రీరామ్‌' అని ఉండటంతో భక్తులు పోటెత్తారు. బీహార్‌లోని..

Patna Floating Stone: గంగానదిలో తేలుతున్న మిస్టీరియస్ రాయి.. రామసేతు శిలంటూ పూజలు చేస్తోన్న ప్రజలు
Patna Floating Stone
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 27, 2023 | 7:07 AM

పట్నా, ఆగస్టు 27: గంగానదిలో దొరికిన ఓ రాయి ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. నదిలో తేలియాడుతూ కనిపించిన ఈ రాయి రామసేతుకి సంబంధించినదని భావించిన స్థానికులు దానికి పూజలు చేయడం ప్రారంభించారు. పైగా ఆ రాయిపై ‘శ్రీరామ్‌’ అని ఉండటంతో భక్తులు పోటెత్తారు. బీహార్‌లోని పాట్నాలో గంగా నది రాజ్‌ఘాట్‌ వద్ద ఈ రాయి దొరికింది. వివరాల్లోకెళ్తే..

బీహార్ రాజధాని పాట్నాలోని రాజా ఘాట్ సమీపంలో గంగా నదిలో ఓ రాయి తేలియాడుతూ కనిపించింది. ఆ రాయిని చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇద్దరు యువకులు ఈదుకుంటూ వెళ్లి గంగానది నుంచి రాయిని బయటకు తీసుకొచ్చారు. ఆ రాయిపై ‘శ్రీరామ్‌’ అని రాసి ఉండడంతో స్థానికులు ఈ రాయిని రాజా ఘాట్ సమీపంలోని ఆలయలో నీటి తొట్టిలో ఉంచి పూజలు చేస్తున్నారు. ఈ రాయి అక్షరాలా శ్రీరాముడి కాలంలో నిర్మించిన రామసేతుకు సంబంధించిన శిల అని, అందుకే దానిని ‘రామసేతు శిల’ అని పిలవడం ప్రారంభించారు. ఇక ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడటంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు రాజా ఘాట్‌లోని ‘రామసేతు శిల’ను వీక్షించేందుకు పోటెత్తారు.

పట్నాలో ఇప్పటికే 3 రామసేతు రాళ్లు

నీళ్లతో తేలియాడే రాళ్లు పాట్నాలోని గంగానదిలో కొట్టుకురావడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటికే అక్కడ రామసేతు శిలలుగా భావించే మూడు రాళ్లు లభ్యమయ్యాయి. ఈ రాళ్లలో ఒక దానిని పాట్నాలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో ఒకటి, విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో రెండవ రాయి, పాట్నాలోని ప్రసిద్ధ పటాన్ దేవి ఆలయ ప్రాంగణంలో మూడో రాయిని ప్రతీష్టించారు. ప్రస్తుతం మరో మారు రాజా ఘాట్ వద్ద నీళ్లలో తేలియాడుతూ మరో రాయి కనిపించడంతో ఆ సంఖ్య నాలుగుకు పెరిగింది.

ఇవి కూడా చదవండి

తూకం వేస్తే రాయి బరువు పెరిగిపోతుంది..

హర్ష్ కుమార్ అనే స్థానికుడు మాట్లాడుతూ.. ఈ రాయిని తూకం వేసి చూడగా మొదటిసారి దాని బరువు తొమ్మిది కిలోలు వచ్చింది. ఆ తర్వాత మరోమారు బరువు చూడగా దాని బరువు 14 కిలోలకు పెరిగింది. బరువు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. నీళ్లలో వేస్తే మాత్రం తేలియాడుతుంది. రాజా ఘాట్‌లో ఎల్లవేళలా శ్రీరాముడికి పూజలు జరుగుతుంటాయని హర్ష్ కుమార్ తెలిపారు. కాగా గత యేడాది కూడా శ్రావణమాసంలో రాజా ఘాట్ వద్ద పలు రకాల వింత జీవులు బయటపడ్డాయి. సరిగ్గా ఇదే ఘాట్‌పై ఓ బంగారు రంగు తాబేలు నడుచుకుంటూ వెళ్లడం స్థానికులు గమనించారు. అనంతరం దానిని గంగానదిలో విడిచిపెట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.