Trolls: పప్పులో కాలేసిన మంత్రి.. చంద్రయాన్-3 గురించి మాట్లాడి అభాసుపాలు.
యావత్ భారతదేశాన్ని ఎంతో ఉత్తేజపరిచింది చంద్రయాన్ 3 ప్రయోగం. చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై దిగి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ పేరును చరిత్రలో లిఖించింది. ఈ ప్రయోగాన్ని దేశంలోని ప్రముఖులు, విద్యార్థులు, సామాన్య జనం ఎంతో ఉత్సాహం, ఉత్కంఠగా వీక్షించారు. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే..
యావత్ భారతదేశాన్ని ఎంతో ఉత్తేజపరిచింది చంద్రయాన్ 3 ప్రయోగం. చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్.. చంద్రుడిపై దిగి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ పేరును చరిత్రలో లిఖించింది. ఈ ప్రయోగాన్ని దేశంలోని ప్రముఖులు, విద్యార్థులు, సామాన్య జనం ఎంతో ఉత్సాహం, ఉత్కంఠగా వీక్షించారు. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి మాత్రం చంద్రయాన్ 3 ప్రయోగం గురించి మాట్లాడి విమర్శల పాలవుతున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం గురించి పూర్తిగా తెలుసుకోకుండానే మీడియా ముందు తనకు వచ్చింది మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోలర్స్, మీమర్స్‌కు కొత్త స్టఫ్‌గా మారారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత రాజస్థాన్ క్రీడా శాఖ మంత్రి అశోక్ చందన్ మీడియాతో మాట్లాడారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అప్పటి వరకు బాగానే మాట్లాడిన అశోక్ చందన్ అప్పుడే పప్పులో కాలేశారు. చంద్రయాన్ 3 ప్రయోగంలో ప్రయాణించిన వారికి ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నానంటూ చెప్పారు. స్పేస్ రీసెర్చ్‌లో ఇండియా మరో అడుగు ముందుకేసిందని.. ఈ మిషన్ సక్సెస్ అయిన సందర్భంగా భారత పౌరులందరికీ శుభాకాంక్షలు చెబుతున్నానంటూ గొప్పగా చెప్పారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. చంద్రయాన్ 3 ప్రయోగంలో ఇస్రో.. మనుషులను పంపలేదు. కానీ కనీస పరిజ్ఞానం కూడా లేకుండానే మంత్రి అలా మాట్లాడటం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

