Viral Video: కళ్లు మూయకుండా తుమ్ముతానని ఛాలెంజ్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రతి ఒక్కరికీ తుమ్ము రావడం అనేది సర్వసాధారణం. అలాగే తుమ్మినప్పుడు యథాలాపంగా కళ్లు మూసుకోవడం కూడా షరా మామూలే. ఐతే మీలో ఎవరికైనా కళ్లు తెరిచి తుమ్మిన అనుభవం ఉందా? దాదాపుగా ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే తుమ్మినప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కళ్లు మూసేస్తారు. ఇప్పుడు తుమ్ముల గొడవేంటి..? అని చిరాకు పడకండి. ఓ గడుగ్గాయి ఎవరూ..

Viral Video: కళ్లు మూయకుండా తుమ్ముతానని ఛాలెంజ్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Trying To Sneeze With My Eyes Open
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 25, 2023 | 6:01 PM

ప్రతి ఒక్కరికీ తుమ్ము రావడం అనేది సర్వసాధారణం. అలాగే తుమ్మినప్పుడు యథాలాపంగా కళ్లు మూసుకోవడం కూడా షరా మామూలే. ఐతే మీలో ఎవరికైనా కళ్లు తెరిచి తుమ్మిన అనుభవం ఉందా? దాదాపుగా ఎవ్వరికీ ఉండదు. ఎందుకంటే తుమ్మినప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కళ్లు మూసేస్తారు. ఇప్పుడు తుమ్ముల గొడవేంటి..? అని చిరాకు పడకండి. ఓ గడుగ్గాయి ఎవరూ చేయలేని పని చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అదేనండీ కళ్లు మూయకుండా తుమ్మేసింది.. అదేంటీ అదెలా సాధ్యం. మేం అస్సలు నమ్మం.. అని అనుకుంటున్నారా? ఐతే మీరీ వీడియో చూడాల్సిందే..

బెలా అమర్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఈ వీడియో షేర్‌ చేసింది. చూడటానికి చక్కగా ఉన్న ఈ అమ్మాయి కళ్లు మూయకుండా నేను తుమ్మి చూపిస్తానంటూ ఛాలెంజ్‌ విసిరింది. అంతే మేకప్‌ బ్రెష్‌ ముక్కులో పెట్టి ఒక్క తుమ్ము తుమ్మింది. కానీ కళ్లు మాత్రం అలాగే తెరిచి ఉంచింది. కనురెప్పలు కాస్త కదలించిందే తప్ప.. కళ్లు మూయలేదండీ! అంతకు మించి మరేం జరగలేదు. చక్కగా నవ్వుతూ వీడియో కనిపించింది. ఇక ఈ వీడియో చూపిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

నిజానికి.. తుమ్మినప్పుడు కళ్లు మూయకుంటే కంటిలో నరాలు చిట్లిపోతాయని అంటుంటారు. పైగా మనోళ్లకు తమ్ముపై బోలెడంత సెంటిమెంటు కూడా ఉంటుంది. ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణించే ముందు తుమ్మకూడదని.. గడపపై కూర్చుని తుమ్మితే అరిష్టమని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే కొన్ని సార్లు తుమ్ము వచ్చినా బలవంతంగా ఆపుతుంటారు. కానీ ఇలా బలవంతంగా తుమ్ము ఆపితే కంటి నరాలు చిట్టిపోవడం లేదా నరాలు దెబ్బతినడం వంటివి జరుగుతుంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఏదిఏమైని తుమ్మినప్పుడు సెకను పాటు కళ్లు మూస్తే ఈ భూప్రపంచానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఇలాంటి ఛాలెంజ్‌లు సీరియస్‌గా తీసుకుంటే.. ఆ తర్వాత ఏదైనా జరగరాని జరిగితే కలిగే నష్టం ఎప్పటికీ పూడ్చలేం..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.