Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Constable Final Shortlist: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. సెప్టెంబర్ మూడోవారంలో ఫలితాలు?

రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న కానిస్టేబుల్‌ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు త్వరలో విడుదలకానున్నాయి. కానిస్టేబుల్‌ తుది ఎంపిక జాబితా వచ్చేనెల (సెప్టెంబర్‌) 3వ వారంలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడిపై తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎస్సై పోస్టుల తుది ఎంపిక జాబితా విడుదలైన సంగతి తెలిసిందే..

TS Constable Final Shortlist: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. సెప్టెంబర్ మూడోవారంలో ఫలితాలు?
TS Constable Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 24, 2023 | 8:35 AM

హైదరాబాద్‌, ఆగస్టు 24: రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న కానిస్టేబుల్‌ పోస్టుల తుది ఎంపిక ఫలితాలు త్వరలో విడుదలకానున్నాయి. కానిస్టేబుల్‌ తుది ఎంపిక జాబితా వచ్చేనెల (సెప్టెంబర్‌) 3వ వారంలో విడుదల చేయనున్నారు. ఈ మేరకు వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడిపై తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎస్సై పోస్టుల తుది ఎంపిక జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక పోలీస్‌ కానిస్టేబుల్ తుది జాబితా వెల్లడికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలోని వివిధ విభాగాలు, జైళ్లశాఖ, అగ్నిమాపకశాఖ, రవాణా, ఎక్సైజ్‌శాఖల్లో కలిపి దాదాపు 16,929 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.

తుది రాత పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలు మే 30న బోర్డు వెల్లడించింది. అర్హులందరికీ జూన్‌ 1న ధ్రువపత్రాల పరిశీలన చేశారు. ముందుగానే ఎస్‌ఐ పోస్టుల తుది ఎంపిక జాబితాను బోర్డు అధికారులు వెల్లడించగా ప్రస్తుతం వారి నియామక ప్రక్రియ తుదిదశలో ఉంది. పోలీస్‌ విచారణ, మెడికల్‌ టెస్ట్‌ అనంతరం నియామక పత్రాలు జారీ చేస్తారు. ఆగస్టు నెలాఖరుకి ఎస్సైల శిక్షణ ప్రారంభించనున్నారు. దీంతో 554 ఎస్సై కొలువుల నియామక ప్రక్రియ పూర్తవుతుంది.

కానిస్టేబుల్‌ కొలువులకు కూడా తుది ఎంపిక జాబితా విడుదలైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చేందుకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఏర్పాట్లు చేస్తోంది. ఎస్సైలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీ(టీఎస్‌పీఏ) ఆధ్వర్యంలో, కానిస్టేబుళ్లకు శిక్షణ విభాగం నేతృత్వంలో దాదాపు 9 నెలలపాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కానిస్టేబుళ్లకు అక్టోబర్‌లో శిక్షణ ప్రారంభించనున్నారు. కానిస్టేబుల్‌ తుది రాత పరీక్షలో మొత్తం 1,01,600 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తుది ఎంపికలో ప్రతి ఆరుగురు అభ్యర్థుల్లో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మరో మూడు నుంచి నాలుగు వారాలలో మొత్తం ప్రక్రియ ముగియనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.