AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3: చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారంపై వెనక్కి తగ్గిన విద్యాశాఖ.. కీలక ఆదేశాలు జారీ

Chandrayaan 3 moon landing will not be telecast live in Telangana schools: స్కూళ్లలో చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ టెలికాస్టింగ్‌పై తెలంగాణ విద్యా శాఖ వెనక్కి తగ్గింది. ఇంటి దగ్గరే విద్యార్థులు లైవ్‌లో చూసుకునేలా సమాచారం ఇవ్వాలని అన్ని స్కూళ్ల ప్రిన్సిపల్‌లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో ఎలాంటి సామూహికంగా లైవ్‌లు లేదా విద్యార్థులను ప్రత్యేకంగా బయటికి తీసుకెళ్లోద్దని ఆదేశించారు. ఎవరైనా ఇంటి దగ్గర చూడకపోతే తర్వాత రోజు స్కూల్లలో యుట్యూబ్ లో చూపించాలని స్కూళ్ల ప్రిన్సిపల్‌లను ఆదేశించారు. తర్వాత రోజు సెమినార్, స్పీచ్, ఎస్సే రైటింగ్..

Chandrayaan 3: చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారంపై వెనక్కి తగ్గిన విద్యాశాఖ.. కీలక ఆదేశాలు జారీ
Chandrayaan 3 Moon Landing
Srilakshmi C
|

Updated on: Aug 23, 2023 | 9:35 AM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 23: స్కూళ్లలో చంద్రయాన్-3 ల్యాండింగ్ లైవ్ టెలికాస్టింగ్‌పై తెలంగాణ విద్యా శాఖ వెనక్కి తగ్గింది. ఇంటి దగ్గరే విద్యార్థులు లైవ్‌లో చూసుకునేలా సమాచారం ఇవ్వాలని అన్ని స్కూళ్ల ప్రిన్సిపల్‌లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో ఎలాంటి సామూహికంగా లైవ్‌లు లేదా విద్యార్థులను ప్రత్యేకంగా బయటికి తీసుకెళ్లోద్దని ఆదేశించారు. ఎవరైనా ఇంటి దగ్గర చూడకపోతే తర్వాత రోజు స్కూల్లలో యుట్యూబ్ లో చూపించాలని స్కూళ్ల ప్రిన్సిపల్‌లను ఆదేశించారు. తర్వాత రోజు సెమినార్, స్పీచ్, ఎస్సే రైటింగ్ చంద్రయాన్-3 పై నిర్వహించాలని ఆదేశించారు. కాగా చంద్రయాన్-3 ఈ రోజు చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఈ చారిత్రక ఘట్టాన్ని స్టూడెంట్స్ లైవ్ లో వీక్షించేందుకు విద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ డీఈవోలు, ప్రిన్సిపల్స్‌కు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇచ్చారు. ఈ నిర్ణయంపై మార్పులు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని విద్యాసంస్థల యాజమన్యాలు కింద ఇచ్చిన సూచనలను పాటించవలసిందిగా సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది. అవేంటంటే..

  • ఆగస్టు 23, 2023వ తేదీన (బుధవారం) చంద్రయాన్ 3 సేప్‌ ల్యాండింగ్‌ ప్రోగ్రాం నేపథ్యంలో స్కూల్ టైమింగ్స్ పొడిగించడం లేదు. చంద్రయాన్ -3 కారణంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు గుమిగూడడం లేదా విద్యార్థులను మరొక ప్రదేశానికి తరలించడం వంటివి చేయరాదు
  • చంద్రయాన్ -3 లైవ్‌ ప్రోగ్రాంను విద్యార్ధులు వాళ్ల ఇళ్లలోని టీవీలలో, అన్ని ప్రైవేట్ ఛానెల్‌లలో చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు విద్యార్ధుల తల్లిదండ్రులందరికు సమాచారం అందించాలి లేదా మెజేస్‌లు పంపించాలి.
  • విద్యార్థులందరూ చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారాన్ని వారి ఇంటి వద్ద వారి తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే చూడాలి.
  • విద్యార్థులు ఎవరైనా ఆగస్టు 23, 2023వ తేదీన ప్రత్యక్ష ప్రసారాన్ని చూడలేకపోతే, సంబంధిత విద్యాసంస్థల యాజమన్యం మరుసటి రోజు (అంటే ఆగస్టు 24) పాఠశాల ఆవరణలో యూట్యూబ్‌లో చూపించాలి.
  • అలాగే మరుసటి రోజు (ఆగస్టు 23) సెమినార్/ప్రసంగం/వ్యాస రచన నిర్వహించాలి. చంద్రయాన్ -3 జాతీయ ప్రాముఖ్యత ఏమిటి? ఇక ఇండియన్‌గా నువ్వెలా ఫీల్‌ అవుతున్నావు? లైవ్‌ చూసినప్పుడు అతని/ఆమె అనుభవం ఏమిటి?వంటి అంశాలపై నిర్వహించాలి.
  • ఈ విషయంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత విద్యాసంస్థల యాజమన్యం బాధ్యత వహించాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.