ISRO Recruitment Scam: చొక్కా గుండీల్లో కెమెరా లెన్స్‌లు, చెవిలో ఇయర్‌ పీస్‌లు.. ఇస్రో ఉద్యోగ పరీక్షలో కేటుగాళ్ల ఘరానా మోసం!

ఇస్రోకు సంబంధించిన ‘విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌’ (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షలో ఇద్దరు అభ్యర్ధులు అక్రమాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. హైటెక్‌ మోసానికి పాల్పడిన నిందితులు కచ్చితంగా ఇలాంటి మోసాల్లో ఆరితేరినవారే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బులిస్తే పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చేస్తామని నిందితులు నమ్మబలికి ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. ప్రత్యేక తరహాలో కుట్టించిన షర్టులు ధరించి, వాటికున్న గుండీల్లో ఇమిడిపోయేలా అతి చిన్న సూక్ష్మ కెమెరా లెన్సులను..

ISRO Recruitment Scam: చొక్కా గుండీల్లో కెమెరా లెన్స్‌లు, చెవిలో ఇయర్‌ పీస్‌లు.. ఇస్రో ఉద్యోగ పరీక్షలో కేటుగాళ్ల ఘరానా మోసం!
ISRO Recruitment Exam
Follow us
Srilakshmi C

| Edited By: Ravi Kiran

Updated on: Aug 23, 2023 | 4:00 PM

తిరువనంతపురం, ఆగస్టు 23: ఇస్రోకు సంబంధించిన ‘విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌’ (వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్షలో ఇద్దరు అభ్యర్ధులు అక్రమాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. హైటెక్‌ మోసానికి పాల్పడిన నిందితులు కచ్చితంగా ఇలాంటి మోసాల్లో ఆరితేరినవారే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బులిస్తే పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చేస్తామని నిందితులు నమ్మబలికి ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. ప్రత్యేక తరహాలో కుట్టించిన షర్టులు ధరించి, వాటికున్న గుండీల్లో ఇమిడిపోయేలా అతి చిన్న సూక్ష్మ కెమెరా లెన్సులను అమర్చారు. వాటి ద్వారా ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను స్కాన్‌ చేసి ఎక్కడో ఉన్న వేరే వారికి చేరవేశారు. అనంతరం చెవిలో ఉన్న ఇయర్‌ పీస్‌ ద్వారా జవాబులు తెలుసుకుని సమాధానాలు రాశారు.

ఐతే ఇవి ఏ బ్రాండ్‌కి చెందినవి కావు. ప్రత్యేకంగా నిపుణుల వద్ద వీటిని తయారు చేయించారు. వీటిల్లో సిమ్‌ కార్డు కూడా అమర్చవచ్చు. ఇలాంటి మూడు పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా ప్లాన్‌ ప్రకారం నిందితులు పరీక్ష ముందు రోజు విమానంలో నగరానికి వచ్చారు. ఈ వ్యవహారం అంతా తెలుసుకున్నాక దీనివెనుక పెద్ద కుట్రనే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. భారీ మొత్తంలో డబ్బు చేతులు మారి ఉంటుందని అనుమానిస్తున్నారు. వీరు ఉపయోగించిన సాంకేతికతను ఆధారంగా వీళ్లు ఇలాంటి నేరాల్లో ఆరితేరినట్లు భావిస్తున్నారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటివి గతంలో ఏమైనా జరిగాయా అనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు తిరువనంతపురం పోలీసు కమిషనర్‌ నాగరాజు చకిలం మంగళవారం మీడియాకు తెలిపారు.

కాగా విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ ఆగస్టు 20న టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స్‌మన్-బి, రేడియోగ్రాఫర్-ఎ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కేరళలోని వేరు వేరు పరీక్ష కేంద్రాల్లో ఒకరికి బదులు వేరొకరి పరీక్షలు రాస్తూ ఇద్దరు కేటుగాళ్లు అడ్డంగా బుక్కైయ్యారు. రెండు రోజుల వ్యవధిలో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం పరీక్షను రద్దుచేయమని వీఎస్‌ఎస్‌సీకి సూచించగా.. ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ ప్రకటన కూడా వెలువరించింది. మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని వీఎస్‌ఎస్‌సీ తన ప్రకటనలో తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.