Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Biometric: మీ ఆధార్‌ బయోమెట్రిక్ భద్రమేనా.? లేదంటే మీ బ్యాంక్‌ అకౌంట్ ఖాళీ అవుతుంది సుమీ

ఏపీ వ్యాప్తంగా గత కొద్దీ కాలంగా AEPS మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఖాతాదారుల ప్రేమేయం లేకుండానే బ్యాంకుల్లో సొమ్ము లూఠీ అవుతుంది. మొన్నటి వరకు ఓటీపీ చెప్తేనో, ఫోన్ కి ఏదైనా మెస్సేజ్ రావటం,అనుకోకుండా ఎవో లింక్స్ క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడటం లాంటివి ఇప్పటి వరకు జరిగిన మోసాలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎలాంటి ఓటీపీ చెప్పనవసరం లేదు ఏ లింక్ క్లిక్ చేయనవసరం లేదు అసలు ఖాతాదారుల ప్రేమయమే లేకుండా వారి సొమ్ము మాయం చేసేస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్ క్లోనింగ్ తో గత..

Aadhaar Biometric: మీ ఆధార్‌ బయోమెట్రిక్ భద్రమేనా.? లేదంటే మీ బ్యాంక్‌ అకౌంట్ ఖాళీ అవుతుంది సుమీ
Aadhaar Biometric
Follow us
P Kranthi Prasanna

| Edited By: Srilakshmi C

Updated on: Aug 23, 2023 | 12:47 PM

అమరావతి, ఆగస్టు 23: మీ ఆధార్ బయోమెట్రిక్ భద్రమేనా, ఆధార్ సేఫెనా అంటే ఇలాంటి ప్రశ్నలకు ప్రస్తుతం గ్యారెంటీ లేదనే అనిపిస్తుంది. లీక్ అవుతున్న ఆధార్ డేటాతో జరిగే మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి..లీక్ అవుతున్న ఆధార్ డేటాతో కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఆధార్ బయోమెట్రిక్ టార్గెట్ గానే బ్యాంకు ఖాతాలు కాళీ చేస్తున్నారు.

ఏపీ వ్యాప్తంగా గత కొద్దీ కాలంగా AEPS మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఖాతాదారుల ప్రేమేయం లేకుండానే బ్యాంకుల్లో సొమ్ము లూఠీ అవుతుంది. మొన్నటి వరకు ఓటీపీ చెప్తేనో, ఫోన్ కి ఏదైనా మెస్సేజ్ రావటం,అనుకోకుండా ఎవో లింక్స్ క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడటం లాంటివి ఇప్పటి వరకు జరిగిన మోసాలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎలాంటి ఓటీపీ చెప్పనవసరం లేదు ఏ లింక్ క్లిక్ చేయనవసరం లేదు అసలు ఖాతాదారుల ప్రేమయమే లేకుండా వారి సొమ్ము మాయం చేసేస్తున్నారు. ఆధార్ బయోమెట్రిక్ క్లోనింగ్ తో గత మూడున్నర నెలల్లో ఒక్క విజయవాడ వ్యాప్తంగా 150 కు పైగా ఖాతాలోంచి కొన్ని లక్షల రూపాయల సొమ్మును స్వాహా చేసారు కేటుగాళ్ళు.

ఆధార్ బయోమెట్రిక్ అనే దానికి ఎంత ప్రాముఖ్యతో ఉందొ ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. ఎక్కడికి వెళ్లిన ఆధార్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ల నుండి ఆర్టీఓ ఆఫీస్ ల వరకు ప్రభుత్వ పెన్షన్ నుండి ప్రైవేట్ అవసరాల వరకు అన్నిటికి ఆధార్ తప్పనిసరి ఆఖరికి సెల్ ఫోన్ సిమ్ తీసుకోవాలన్న ఆధార్ బయోమెట్రిక్ తప్పని సరి. ప్రభుత్వం కూడా పదే పదే ప్రతిదానికి ఆధార్ మేనిడేటరీ అని చెప్తుంది. కానీ ఇప్పడూ ఆధార్ డేటా తోనే భారీ చోరీలు జరుగుతున్నాయి. పబ్లిక్ ఆధార్ డేటా లీక్ అవ్వటానికి పదుల సంఖ్యలో పాయింట్స్ తయారయాయ్యి. తాజాగా జరుగుతున్నా AEPS మోసాలు కూడా ఆధార్ బయోమెట్రిక్ ద్వారానే జరుగుతున్నాయి..తమ ప్రేమేయం లేకుండానే రోజు పదుల సంఖ్యలో డబ్బులు పోయిన వారు పోలీసులని ఆశ్రయిస్తున్నారు. డబ్బు పోయిన వారంతా కొద్దీ రోజుల ముందే ఎక్కడో ఒక దగ్గర బయోమెట్రిక్ వేసిన వారే అందులో కూడా ఎక్కువగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో బయోమెట్రిక్ వేసినవారే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి చాలా చోట్ల నుండి తీసుకుంటున్న ఆధార్ డేటా తో క్లోనింగ్ ద్వారా ఖాతాలు ఖాళీ చేస్తున్నారు కేటుగాళ్ళు. ఈ మధ్య కాలంలో ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా ప్రైవేట్ ఏజెన్సీ ల ద్వారా ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా పర్మిషన్ తీసుకోకుండా గత కొద్దీ కాలంగా CSP పాయింట్స్ అంటే కస్టమర్ సర్వీస్ పాయింట్స్ అని కొన్ని కేంద్రాలు ఏర్పడ్డాయి. మినీ బ్యాంక్ తరహాలో ఫినో బ్యాంకు ఉంటుంది. ఈ ఫినో బ్యాంక్ పాయింట్ తీసుకోవాలంటే ఆధార్, పాన్, కమర్షియల్ టాక్స్, ఇంటర్నెట్, సిస్టం, ఆఫీస్ ఉంటే చాలు ఇక్కడ ఆధార్ బయోమెట్రిక్ డబ్బులు డ్రా చేసేయ్యొచ్చు. ఇలాంటి ప్రైవేట్ బ్యాంకులకు ఇచ్చే మిషన్స్ ద్వారానే ఐడీ తీసుకుని ఎక్కడో అడవుల్లో కూర్చుని బయోమెట్రిక్ క్లోనింగ్ ద్వారా డబ్బులు డ్రా చేస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు. ఎవరు డ్రా చేస్తున్నారు, ఎక్కడ డ్రా చేస్తున్నారు అని ఎంక్వరి చెయ్యటానికి వెళ్లిన పోలీసులకు సైతం ఇలాంటీ బ్యాంకులు సహకరిస్తున్నట్లు బయటపడింది. ఇలాంటి వాటికీ పులిస్టాప్ పడాలంటే బయోమెట్రిక్ లాక్ పెట్టుకోవాలంటున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.