AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ జంట బలవన్మరణం.. ఒకరి తర్వాత ఒకరు తరలిరాని లోకాలకు!

తూర్పు గోదావరి, యానాం సమీపంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక (22) అనే యువతి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. మౌనికకు అక్క, చెల్లి ఉండగా ఇద్దరికీ వివాహాలు జరిగి వారివారి అత్తారిళ్లలో ఉంటున్నారు. ఇక మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు వద్ద ఉంటూ తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్‌ కాలేజీలో నర్సింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల క్రితం కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో మౌనికకు స్నేహం కుదిరింది. వారి స్నేహం కాస్తా ప్రేమకు..

ప్రేమ జంట బలవన్మరణం.. ఒకరి తర్వాత ఒకరు తరలిరాని లోకాలకు!
Mounika
Srilakshmi C
|

Updated on: Aug 22, 2023 | 8:06 AM

Share

యానాం, ఆగస్టు 22: ప్రేమించిన యువకుడు వ్యసనాలకు బానిసయ్యాడు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. దీంతో అతను లేని లోకంలో తానూ మనలేక ఆత్మహత్యకు పాల్పడిందో యువతి. రోజుల వ్యవధిలోనే రెండు ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబ సభ్యుల రోదన మిన్నంటాయి. ఈ విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా యానంలో చోటుచేసుకుంది. ఎస్సై నూకరాజు తెలిపిన వివరాల ప్రకారం..

తూర్పు గోదావరి, యానాం సమీపంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక (22) అనే యువతి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. మౌనికకు అక్క, చెల్లి ఉండగా ఇద్దరికీ వివాహాలు జరిగి వారివారి అత్తారిళ్లలో ఉంటున్నారు. ఇక మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు వద్ద ఉంటూ తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్‌ కాలేజీలో నర్సింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. రెండేళ్ల క్రితం కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో మౌనికకు స్నేహం కుదిరింది. వారి స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. ఐతే చిన్నాకు చెడు వ్యసనాలు అధికం. ఈ క్రమంలో గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల క్రితం తన సోదరుడిని రూ.500 అడిగాడు. ఐతే చిన్నా సోదరుడు డబ్బులివ్వలేదు. దీంతో కోపోధ్రిక్తుడైన చిన్నా ఒంటికి నిప్పంటించుకున్నాడు.

వెంటనే కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి బాధితుడిని కాకినాడలోని ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలపాలైన చిన్నా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రేమించిన వాడు మరణించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక కాలేజీకి వెళ్లడం మానేసింది. చిన్నా జ్ఞాపకాలతో మానసికంగా కుంగిపోయింది. అతనికి సంబంధించిన దుస్తులు, వస్తువులను గదిలో పెట్టుకుని, ఫొటోలు గోడలకు అతికించి కన్నీరుమున్నీరుగా విలపించింది. ప్రేమించినవాడు ఇకలేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు కేసు నమోదు చేసుకుని, యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!